గురు పౌర్ణమి

గురు పౌర్ణమి

 

ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి…

ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల ప్రభావం చాలా ఉంటుంది..అయితే ఒక్కరో ఇద్దరో ఎక్కువ ప్రభావితం చేస్తుంటారు..నాకైతే నా జీవితంలో చాలా మంది గురువులతో బంధం ఉందిఅది ఎలా అంటే?

నా చిన్నప్పుడు మా ఇంటి ముందు తడకల బడికి పంపారు అక్కడ మా చిన్న సారండే వారుఆయనకు నేనంటే చాలా ఇష్టం ఊర్కే నన్ను గజ్జల గుర్రం అని ఏడిపించే వారు..

ఆయనను అస్సలు మర్చి పోలేను అంత చిన్నప్పుడు చెప్పినాయన ఎలా గుర్తున్నాడనేగా? మీ సందేహం?అదే చెప్తున్నానుండండి ఆయన చాలా కాలం మా వీధిలోనే ఉండే వారు అదీ సంగతి..

ఇక ఆ తరువాత మూడు నుంచి ఆరు వరకు మా అక్క వాళ్ల స్కూల్లో వేసారు..అక్కడ నాకు టీచరు చెల్లిగా ముద్ర పడి పోయింది అందరూ ముద్దు చేయడమే! ఇక ఆ టీచర్లను నేను మరిచి పోదామన్నా మా అక్క మర్చి పోనీయదు నిన్ను యశోద టీచరు అడిగిందే! రామారావు సారు అడిగాడే! లక్ష్మి బాయి టీచరు వస్తానంటుందే! ఇలాగన్నమాట..

ఓ సారి రెండుసార్లు తీసుకొచ్చింది కూడా!ఆ స్కూల్లో అయితే భలే బాగుండేది..మాకక్కడ సంగీతం కి ఒక పీరియడ్ తబలా కొకటి కుట్టుకొకటి అలా ఉంటుండె..

మా తబలా సార్ వరదాచారి గారు చనిపోయారట పాపం అన్నీ మా అక్క చెప్తది దానికి కొలీగ్స్ కదా!ఆ తరువాత సెవంత్ నుండి ఎవరిరెకమండ్ లేదు మళ్లీ నేను మా అమ్మ దగ్గరకు వచ్చేసా! కానీ అక్కడ నా గుర్తింపే నాకు..

ఇంటర్ లో మాత్రం మా సుబ్బారావు ప్రన్సిపాల్ సార్ తో నా ఛాలెంజ్ నేను మర్చి పోలేనిదిఆ సార్ తో ఛాలెంజ్ చేసి గెలిచా!అవన్నీ రాద్దామంటే ఓపిక లేదిక
అవండి నా గురువు గార్ల విశేషాలు..

అయ్యెా! ఇంకా నాకిష్టమైన శంకరయ్య సార్ ను మర్చి పోయా!మా ఇంగ్లీష్ లెక్చరర్ నేను ఆయన దగ్గరికి ట్యూషన్ కి కూడా వెళ్దాన్ని సార్ యే కాక సారమ్మ కూడా నాకు అమ్మ లాగ ఒక చదువే కాక అన్నం కూడా పెట్టేది మంచి అమ్మ..

నాకు చాలా చాలా ఇష్టం..ఇప్పుడందరూ ఎక్కడ ఉన్నారో? ఎలా ఉన్నారో? అందరికీ నా పాదాభి వందనాలు..🙏

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *