గురు బోధ
నా చిన్నతనంలో ఎందరోగురువులు నన్ను ప్రభావితంచేసారు. ప్రతి ఒక్కరి జీవితంలోతల్లిదండ్రులే తొలి గురువులు.అలాగే నాకు కూడా నా యొక్క తల్లిదండ్రులే నా తొలి గురువులు. ఇతరులతో ఎలామాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని నేర్పిందినా తల్లిదండ్రులే.
వారు నాకులౌకిక జ్ఞానం నేర్పారు. వారితర్వాత పాఠశాలలో ఎందరోగురువులు నాకు ప్రేరణ ఇచ్చారు. ఇప్పుడు నేనుమూడు భాషల్లో అనర్గళంగామాట్లాడగలుగుతున్నానంటే అది వారి చలవే.
నేను తెలుగు,హిందీ,ఇంగ్లీషు భాషల్లో ఏదైనావ్రాయగలుగుతున్నానంటే అదివారియొక్క అద్భుతమైన శిక్షణ వల్లే. నన్ను సరైన మార్గంలో పెట్టిన నా గురువులఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
అలాగే నా యొక్క ప్రతి నిర్ణయాన్ని విశ్లేషణ చేసి నాకు మంచిసలహాలు చెప్పే మితృలునాకు గురుతుల్యులు. వారియొక్క సలహా,సహకారాలవల్లనే నేను గౌరవప్రదమైనజీవితాన్ని గడపగలుగుతున్నాను.
నా జీవితంలో నాకు ఏదైనాకొత్త విషయాలు నేర్పినవారినినేను గురువుగానే భావిస్తాను.నేను ఇరవై ఆరేళ్ళ నుండివిద్యార్థులకు పాఠాలు బోధించేఅధ్యాపక వృత్తిలో ఉన్నాను.ఇప్పటికి కొన్ని వేల మందివిద్యార్థులకు పాఠాలు బోధించాను.
వారికి పాఠాలేకాక లౌకిక జ్ఞానం అందించేఅవకాశం నాకు లభించటంనా అదృష్టమని నేను ఎప్పుడూ భావిస్తున్నాను.పిల్లల వద్ద నుండి కూడాచాలా విషయాలు నేర్చుకోవచ్చు. వారిలోఉండే ఐకమత్యం నిజంగాచాలా గొప్పగా అనిపిస్తుంది.
ఆ వయసులో కులమతాల పట్టింపులు ఉండవు.అందరూకలసి మెలసి ఉంటారు. ఏదిఏమైనా గురువుని మించినదైవం లేదు అనే మాట అక్షరసత్యం.
–వెంకట భానుప్రసాద్ చలసాని