గుండెలో వాన

 గుండెలో వాన

నెర్రెలిడుచుకున్న నేలవోలే
నెగడు సెగలను తలపిస్తూ
దివారాత్రాలు దాహార్తితో అలమటిస్తూ తడారిపోయిన గొంతుతో అందివచ్చే
ప్రతిచుక్కను ఒడిసి
పట్టుకోవాలనే ఆరాటంతో
ఆశగా ఎదురు చూశాను
నీ వానామృతధారల కోసం!
మొగులు మొత్తం మూసుకొచ్చింది!
కరుణించాడేమో వరుణుడు
ఆశలు మోసులెత్తాయి! కొడగట్టుకుపోతున్న ప్రాణాలకు కొత్త ఊపిరులూదాయి!
బట్టతడుపు వానొచ్చి బయల్దేరిపోయింది!
అకస్మాత్తుగా మొదలైంది కుంభవృష్టిని తలపిస్తూ కరిమబ్బుల వాన!
కండ్ల అలుగును దాటి
గుండె లోతుల్ని తడుపుతూ!

 

 

– మామిడాల శైలజ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *