గుణము
ఆటవెలది:
గుణము లెన్ని యన్న ఘనముగా పదహారు
బ్రహ్మ సుతుడు తెలిపె బోయ దొరకు
రాఘవయ్య కన్న రాజేడి గుణమున?
సత్యసాయి పలుకు సత్య వాక్కు
తాత్పర్యం:
గుణములు పదహారు అని బ్రహ్మ సుతుడు అంటే నారదుడు, బోయ రాజు అంటే వాల్మీకి కి తెలిపెను అని భావము..
రాఘవయ్య అంటే శ్రీరామ చంద్ర మూర్తి ఆయనకంటే గుణములలో రాజెవరూ లేరు అని ఘంటా పథంగా తెలుపుతూ రాసిన ఆటవెలది పద్యం..
– సత్యసాయి బృందావనం