గ్రహించు

గ్రహించు

అరుణ కాలేజీకి వెళ్ళే అమ్మాయి.తన పని ఏంటో తానేంటో అనేంతగా ఉంటుంది. పద్దతి గల అమ్మాయి. కాలేజీకి వెళ్లిందా, వచ్చిందా అనేలా ఉంటుంది తప్ప ఎవర్ని పట్టించుకోదు. తన చుట్టూ ఏమి జరుగుతుందో కూడా తెలియకుండా ఉంటుంది.

అరుణ ఇంటి పక్కనే వినీత్ ఉంటున్నాడు అతను అరుణను ఎప్పటి నుండో ఇష్టపడుతున్నాడు.కానీ చెప్పాలంటే అరుణ అసలు చూడదు మాట్లాడదు .క్లాస్ లో కూడా అంతే సర్ ఏదైనా ప్రశ్న అడిగితే లేచి జవాబు చెప్పి కూర్చుంటుంది. స్నేహితుల తో కూడా హాయ్ బై అంతే తప్ప ఇంకేమీ మాట్లాడదు. తన లక్ష్యం ఒక్కటే డాక్టర్ అవ్వాలి అని అందువల్లే దీక్షగా చదువుతుంది.

తనకి తెలుసు వినీత్ తనను చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అని కానీ తన లక్ష్యం కోసం తాను కష్టపడుతూ ఉండేది పట్టించుకోకుండా ఉండేది. అది వినీత్ కి అర్దం అయ్యి ,తన లక్ష్యానికి చేరుకోవడానికి తాను తనని మాట్లాడిoచే వాడు కాదు. కానీ తన వెన్నంటే ఉండేవాడు.

అదే కాలేజీ లో శ్రవణ్ కూడా చదువుతూ ఉండేవాడు. అతనికి అరుణ అంటే చాలా ఇష్టం. తనని చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. తన ముందుకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా ,నువ్వు కూడా నన్ను ప్రేమించు అనే విధంగా  మాట్లాడేవాడు.

తను అడ్డుగా ఉన్నంతసేపు అరుణ అసలు మాట్లాడకుండా తలదించుకునే ఉండేది. అతను ఎంత అరిచినా కూడా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయేది. అది చాలా కంపరంగా అనిపించేది శ్రవణ్ కి..

ఎన్నిసార్లు చెప్పినా కూడా తను పట్టించుకోకపోగా, అసలు ఒక్క సమాధానం కూడా ఇవ్వకపోవడంతో, శ్రావణ్ ఆమె తనని ఇన్సల్ట్ చేసినట్టుగా అందరి ముందు అతను పరాభవం చెందినట్టుగా భావించాడు. దాంతోపాటు అరుణపై కోపాన్ని కూడా పెంచుకున్నాడు.

ఇక పరీక్షల్లో చివరి రోజు అరుణ అసలు పుస్తకాన్ని వదిలిపెట్టలేకుండా చదువుతూనే ఉంది. తల్లిదండ్రులు కూడా ఆమెని కదిలించకుండా చదువుకోమని నిశ్శబ్దంగా ఉన్నారు.

ఇక చివరి పరీక్ష అయిపోతే అరుణమల్లి కంటికి కనిపించదు అని అనుకుంటూ వినీత్ ఆమె వెనకాలే కాలేజీకి బయలుదేరాడు తన వెనకాల వినీత్ వస్తున్న సంగతి తనకు కూడా తెలుసు.

కాలేజీకి ఇంకా పది అడుగుల దూరంలో ఉండగా శ్రావణ్ తన గ్యాంగ్ తో వచ్చాడు వినిత్ దూరంగా జరిగాడు జరిగి తన ఫోన్తో వీడియోను రికార్డు చేస్తూ అలాగే పోలీసులకు సమాచారం అందించాడు.

శ్రవణ్ గ్యాంగ్ అరుణ జుట్టు తిరుగుతూ ఈరోజు చివరి ఎక్సమ్ ఎలా రాస్తావో నేను చూస్తాను నువ్వు ఇక్కడే ఇలాగే నిలబడి ఉండాలి ప్రేమించమంటే వేషాలు ఇస్తావా అంటూ అరుణ నీ అలాగే నిలబెట్టాడు.

ఓవైపు పరీక్షా సమయం అయిపోతుంది ఇక్కడ శ్రవణ్ ఏమో తనని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు తనకి ఏం చేయాలో తెలియలేదు చుట్టూ జనాలు ఉన్న విచిత్రంగా చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా అరుణకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

పరీక్ష రాయలేకపోతున్నానని బాధలో అరుణ చాలా కోపంగా శ్రవణ్ వైపు వచ్చి తన చెప్పుతీసి అతని చెంపపై కొట్టి విసురుగా వెళ్ళిపోయింది ఆ వెనకే వినీత్ కూడా వెళ్ళిపోయాడు. అరుణ చివరి పరీక్ష చాలా విజయవంతంగా రాసింది. అరుణ చాలా సంతోషంగా పరీక్ష రాసి బయటకు వచ్చింది రావడంతోటే ఆమె మొహం పై శ్రవణ్ యాసిడ్ బాటిల్ విసిరేశాడు.

ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న వినీత్ చాటుక్కున అరుణని కిందికి లాగేసాడు దాంతో యాసిడు మొత్తం వినీత్ పై పడింది ఇంతలో పోలీసులు వచ్చారు శ్రావణి అరెస్టు చేసి తీసుకొని వెళ్లారు.

యాసిడ్ మొహం పై పడటంతో వినీత్ చాలా అరుస్తూ ఉన్నాడు అప్పుడు నోరు విప్పింది అరుణ నీకేం కాదు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను అంటూ ఎవరైనా అంబులెన్స్ ని పిలవండి అనగానే పక్కనే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఒకతను అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. ఆ అంబులెన్స్ లో అరుణ వినీత్ ని తీసుకు వెళ్తూ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది వాళ్లు కూడా వినిత్ తల్లిదండ్రులను తీసుకొని అక్కడికి వచ్చారు.

****

కొన్నేళ్ల తర్వాత ఆ ఊరిలో ఒక వైద్యాలయం ప్రారంభమైంది దాని పేరు అరుణ వైద్యాలయం. అక్కడికి వైద్యం కోసం వచ్చేవారికి అంతా ఉచితమే. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తున్నది మరెవరో కాదు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఇన్ని రోజులు ఉన్నా మన అరుణ.

ఇంతలో ఆసుపత్రిలోకి ఒక వృద్ధ జంట వచ్చారు. వారిని నర్సులు నెమ్మదిగా తీసుకొని డాక్టర్ గది లోకి తీసుకొని వెళ్లారు.

అమ్మ నమస్కారం నా పేరు అరుణ మీరు ఏ సమస్యతో వచ్చారు అంటూ పెద్దవారి దగ్గరికి వచ్చింది డాక్టర్ అరుణ.. ఏం లేదమ్మా నాకు మోకాలు నొప్పులు దీనికి కాస్త డిపి ఎక్కువ అయింది చూపించుకుందామని వచ్చాము అంటూ చెప్పారు వాళ్లు.

ఓస్ అంతేనా మీ బిపి మీ కాళ్ళ నొప్పులు చిటికెలో నయం చేస్తుంది మా అరుణ అంటూ నవ్వాడు అతడు. అబ్బా మీరు ఊరుకోండి, మరి నా గురించి ఎక్కువ చెప్పకండి అంది అరుణ.

భార్యాభర్తల జంట చాలా బాగుంది మీరిద్దరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు ఆ వృద్ధ జంట వారి వైద్యం తర్వాత , ఇంతలో ఆ ముసలమ్మ బాబు ఏమిటి నీకు ఆ గాయం అప్పటినుంచి అడగాలని అనుకుంటున్నా కానీ అడిగితే ఏమనుకుంటారో అనే సందిగ్ధంలో ఇంతసేపు అడగలేదు కానీ ఇప్పుడు ఇక ఉండ బట్టలేక అడుగుతున్నాను అంది.

ఇదా ఇది ఈవిడ చలువే, అంటూ అరుణను చూపిస్తూ తన చదివేంటో తాను చదువుకుంటూ ఉండేది. చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించేది కాదు. కానీ కొన్ని రాబందులు ఉంటాయి కదమ్మా. ఆ రాబందులు తనని కాటు వేయాలని చూసాయి. తనని కాపాడుకోవాలనే నా ప్రయత్నంలో ఇలా జరిగింది.

తనకి ముక్కుసూటిగా వెళ్లడమే తెలుసు చుట్టూ ఏం జరుగుతుంది. తన గురించి ఎవరేమనుకుంటున్నారు. తన చుట్టూ ఎవరున్నారు ? ఏం చేస్తున్నారు ? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది గ్రహించలేదు. కాబట్టి తనని కాపాడుకోవాలని నేను తనకి ఎదురు వెళ్లాను. అందుకే ఈ గాయం అన్నాడు వినిత్ నవ్వుతూ….

అయ్యో అదంతా మీకు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉన్నాను అంది ఆవిడ. లేదమ్మా దీనివల్ల మాకు మంచే జరిగింది .అన్నాలు నా ప్రేమని ఒప్పుకొని నా అరుణ ఇప్పుడు నా పెళ్ళాం అయింది .అంటూ అరుణ చేతిని నొక్కాడు వినీత్.

సరేనమ్మా ఇక వెళ్లి వస్తాను మీ మాటలతో మా బిపి నాకు అలా నొప్పులు మటుమాయం అయ్యాయి. అంటూ వాళ్లు ఇద్దరూ బయటకి వచ్చారు. బాగా చదువుకొని ఉంటే మనవాడు కూడా ఇలాగే ఆసుపత్రి పెట్టి వైద్యం చేసేవాడేమో కదయ్యా అంది ఆవిడ అవును నువ్వు చెప్పింది .

నిజమే వాడు ఏం చేస్తున్నాడు వాడి మనసు ఏంటో వాడు ఎటు తిరుగుతున్నాడు అనేది మనం గ్రహించలేకపోయాం. అందువల్ల ఇప్పుడు వాడు చేయరాని పని చేసి జైల్లో మగ్గుతున్నాడు. ఒక ఆడపిల్లను చంపాలని అనుకున్నాడు అంటూ దీర్ఘంగా నెట్టు వచ్చారు శ్రవణ్ తల్లిదండ్రులు.

బయటకు వెళ్ళినప్పుడు కానీ ,లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేదా ఆఫీసులో ఉన్నప్పుడు గానీ, ఆడవాళ్లు అయినా మగవాళ్ళు అయినా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ఏం జరుగుతుంది. మన చుట్టూ ఎవరున్నారు, ఎవరు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అనేది గ్రహిస్తే మంచిది.

అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలాంటి చెడు సావాసాలకు అలవాటు పడుతున్నారు అనేది గ్రహించి అదుపులో పెట్టగలిగితే. ఇప్పుడు శ్రవణ్ జైల్లో ఉండేవాడు కాదు. అలాగే వినీత్ మొహం కాలిపోయేది కాదు. మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది గ్రహించడం చాలా మంచిది.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *