గౌరవం
ఒకప్పడు నేను
ఒక వెలుగు వెలిగాను
ఆ ఇంట్లో రేడియో వుందంటే
అదో గౌరవం
చిత్రం లహరి సినిమా వస్తుందంటే
అన్ని పనులు వగదెంచుకుని
నాముందు కూర్చునే వారు
ఉషశ్రీ రామాయణం వస్తుందంటే
వీధులన్నీ కర్ఫ్యూ ని తలపించేవి
ఎన్నికల తరుణంలో
వార్తలకోసం హోటళ్ళముందు
తిరునాళ్ళలో గుంపులుగా వుండేవారు
నన్ను చేతపట్టుకు పోతుంటే
అదో ఆనందం
ఇప్పుడు అవమానం
నాకు జబ్బుచేస్తే
సరిచేసేవాళ్ళు కరువైనారు
ఎవ్వరికైనా కొన్ని రోజులే వైభవం
ఆపై ఎవ్వరూ తీసుకు రాలేరు గౌరవం.
…………..రేడియో
– విజయ్