గొడవ

 గొడవ

“సాయి నువ్వు నేను కలిసి ఆఫీస్ కి వెళ్దాం” అని చెప్పింది చందన.”ఎప్పుడూ లేనిది కొత్తగా ఆఫీస్ కలిసి వెళదాం అని అంటున్నావ్ ఏంటి?” అని అడిగాడు సాయి.
వాళ్లకి ఇద్దరు పిల్లలు. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి హోమ్ వర్క్స్ రాసుకొని టీవీ చూస్తుంటే సాయి ,చందన ఆఫీసు నుండి వచ్చారు.
కాసేపు అయ్యాక చందన వంట చేసి పిల్లలకి పెడుతుంది.

ఆఫీసులో నువ్వు చేసిన వర్క్ తప్పు. నువ్వు అతనికి చెప్పే అవసరం ఏం వచ్చింది. నేను చెప్తా కదా నువ్వు ఈ మధ్య అతనితో క్లోజ్ గా ఉంటున్నావ్ , నాకు అది నచ్చట్లేదు” అని సాయి చెపుతున్నాడు.

“అది కాదు సాయి. నేను వంశీ మంచి ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా. నేను తనతో క్లోజ్ గా ఉండడం నీకు నచ్చలేదా అనడం ఏంటి?” నాకు అర్థం కావడం లేదు అని అడిగింది చందన.

“ఆ విషయం నాకు తెలుసు కానీ నీకు పెళ్లి అయ్యింది. పిల్లలు ఉన్నారు, కొంచెం కంట్రోల్ లో ఉండు” అని కోపంగా చెప్పేసి వెళ్లిపోయాడు సాయి.
“అంటే నేను ఇప్పుడు ఏమైనా తప్పు చేశానా?” అని అని అడిగింది కోపంగా చందన కూడా.

నేను ఇప్పుడు ఆ మాట అనలేదు” అని చెప్పాడు సాయి.అది కాదు సాయి నాకు పెళ్లి పిల్లలు ఉన్నారని నాకు తెలుసు ఫ్రెండ్స్ తో నేను ఎలా ఉంటానో నీకు తెలుసు. నువ్వు లేనిపోనివి ఊహించుకొని మమ్మల్ని అనుమానించకు” అని చెప్పింది చందన.

ఇలా ప్రతి రోజు ఏదో ఒకదాన్ని గురించి సాయి , చందన ల మధ్య గొడవ జరుగుతూనే ఉండేది.
పిల్లలు మాత్రం ఆ గొడవ చూసి వాళ్ళు కూడా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నారు. పిల్లలు తిన్నారా , ఏం చేస్తున్నారో అని అడుగుతారు కానీ ఒకళ్ళు కూడా పిల్లల దగ్గర కూర్చొని సరదాగా ఉండడం లేదు.

కొన్నాళ్ళకు పిల్లలు పెద్దవారు అయ్యారు.సాయి , చందన ల మధ్య గొడవలను అర్దం చేసుకున్నా పిల్లల్లో తల్లి బాధ పడితే , తండ్రిని విలన్ గా చూస్తారు. కొందరి పిల్లల్లో మెదడు అభివృద్ధికి ఆటంకం ఏర్పడటం, కలత నిద్ర, ఆదుర్దా, కుంగుబాటు, ప్రవర్తనా లోపం, ఇతర తీవ్ర సమస్యలు కనిపిస్తాయి.

వాళ్ళు ఇంకా మానసికంగా లోనవుతునే ఉంటారు.చివరికి సాయి , చందనలు విడిపోయారు. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి తల్లి దగ్గరే ఉండాలని కోర్టు వాళ్ళు చెప్పారు. ఇలా తండ్రి ప్రేమకి దూరం అయ్యి , తల్లి ప్రేమకి దగ్గర ఉన్న. తండ్రి ప్రేమ లేదే అని బాధ పిల్లల మనసులో ఉంటుంది.

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమ కావాలి అని ఎంతో ప్రయత్నం చేసిన ప్రయోజనం ఉండదు. భార్యాభర్తలు గొడవ పడాలి కానీ అది పిల్లల ముందు కాదు. భార్యాభర్తలు గొడవ పడిన పిల్లలతో నార్మల్ గానే ఉండండి..

పిల్లలు ఒంటరిగా ఉండాలని అనుకోవడం మీ తప్పే అయ్యే ఉంటుంది. అది అర్దం చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉండండి.
చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ కోసం పరితపిస్తున్నారు. ఎంత లోకం తెలిసిన పిల్లలు అయినా సరే. తల్లిదండ్రుల ప్రేమ కోసం ఆరాటపడే వాడే ఉన్నారు.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *