జ్ఞాపకం
గుండె గూడులో పదిలంగా మనిషి మెదడులో నిరంతరంగా అదిలించే
అనుభవాలే జ్ఞాపకం
తీపి జ్ఞాపకాల గుర్తులు మనుసును మురిపిస్తే
చేదు జ్ఞాపకాలు వేదనలను వెలికితీస్తుంది
జ్ఞాపకాల నుండి స్ఫూర్తి పొందే క్షణాలు భయపెట్టి బాధను అనుభవించిన రోజులు
మనసుపై గాయం మరువలేని జ్ఞాపకం కళ్ళలో తిరిగి చెరగని ముద్ర వేస్తుంది
ఆప్యాయత తెలిసిన మనుషులు
ఆందోళన లేని పనులు
చింతలేని చదువులు
మరి అమెరికాలో లేని బాల్యం
ఆనందంగా గడిపిన రోజులు
మలుపు తిప్పిన మార్గం
అనుమతించిన సమయం
జ్ఞానం తెలిసినప్పటి నుండి మనిషికి విడువలేని జ్ఞాపకాలు వెంటే ఉండి పోవాల్సిందే….
_ జి జయ