జ్ఞానజ్యోతి
సమాజపు పయనం
ప్రగతిశీల సమాజమే
నేటి మన నినాదం.
సమాజం మారాలంటే
మనం కూడా మారాలి.
కోపతాపాలు పక్కనపెట్టి
కలిసిమెలసి పనిచేయాలి.
అవినీతి లేని సమాజం కోసం
మనమంతా కృషి చెయ్యాలి.
చదువుకునే పిల్లలందరకు
మంచి విద్య అందించాలి.
అజ్ఞానాంధకారాన్ని దూరం
చేసి జ్ఞానజ్యోతి వెలిగించాలి. పిల్లల మనసుల్లో దేశాభక్తి భావనను పెంపొందించాలి.
ప్రగతిశీల సమాజమే
నేటి మన నినాదం.
-వెంకట భానుప్రసాదు చలసాని