ఘోషిస్తూనే
వట్టి చేతులతో వస్తావు
నేలంతా పాకుతావు
ఇల్లంతా నాశనం చేస్తావు
బుడి బుడి నడకలు నడుస్తూ
ముద్దు ముద్దుగా మాట్లాడుతావు
నీ వాళ్లంతా నీ అత పాటలతో
పులకరించిపోతారు,ఆనంద పారవశ్యం
లో మునుగుతారు. ఆట పాటలు ఎన్నో
బొమ్మలతో మునుగుతావు వాటి
రెక్కలు విరిచేస్తావు అదంతా
పసిపిల్లాడి తత్వం
అని పెద్దలు మురిసిపోతారు
చదువు అంటూ గొప్ప చదువులు చదివిస్తారు
చదువుకున్న చదివంత సంస్కారం నేర్పిస్తుంది అనుకుంటే
నీ స్వార్థం కోసం నీ ఇష్టం కోసం నీ భాగస్వామి కోసం
నీకు పుట్టిన పిల్లల కోసం నీ వారందరిని
వదిలేసి ఎక్కడో దూరాన ఉద్యోగం పేరుతో వెళ్ళిపోతావు.
అప్పుడు నువ్వు పాకిన నేలంతా వట్టిదేనని
ఇల్లంతా నాశనం చేసినది
ఈ ఇంటిని వదిలి వెళ్తానని ఉద్దేశమేనని,
బుడిబుడి నడకలే పెద్ద నడకలుగా మారి
తల్లిదండ్రులను వదిలి నీ స్వార్థం కోసం
బొమ్మల రెక్కలు విరిచినట్టుగా
తమ రెక్కలు కూడా విరిచేసి వెళ్ళిపోతావని
ఆ తల్లిదండ్రులు ఊహించి ఉండరు.
ఆ తర్వాత మళ్లీ నీ తరం వస్తుంది
నీకు పిల్లలు పుడతారు వాళ్ళు కూడా
నువ్వు చేసినట్టుగానే చేస్తారు.
అప్పుడు నీకు నీ తల్లిదండ్రులు గుర్తొచ్చి
మనసులో మదన పడతారు
ఆ మదన మనో వ్యధగా మారి
మంచం పట్టి తల్లిదండ్రులకు
నువ్వు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ
ఎలా వచ్చావో అలాగే వెళ్తావు.
నీకోసం 6 అడుగుల నేల ఎదురుచూస్తూ ఉంటుంది
నీ రాక కోసం నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది.
గొయ్యి తీసి పాతి పెట్టాక కూడా ఇంకా నీ దేహం
నేను ఇక్కడే ఉన్నానంటూ గగ్గోలు పెడుతుంది
నాకు ఇంకా తినాలని ఉంది తాగాలని ఉంది
అంటూ చుట్టుపక్క లేచి తిరుగుతూ
నా కొడుకులు నా బిడ్డలు అంటూ వారిని
వేడుకుంటూ ఉంటావు అప్పుడు నీకు
నీ తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు
వారు కూడా ఇలాగే చేసి ఉంటారు కదా
అని ఆలోచనతో నీ ఆత్మ ఇంకా ఘోషిస్తూనే ఉంటుంది..
-భవ్యచారు
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ చాలా బాగా రాసారు 👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐