ఘోర ప్రమాదం..!
ఒడిశాలో ఘోర ప్రమాదం మనసును పిండి వేస్తుంది
సంఘటన మూడు రైళ్ల విషాదం మానవ మృత దేహాల నిలయం
జరిగినటువంటి విలయం
మాంసపు ముక్కల తనువులు శిధిలం శిలా శాసనంలా
నిలిచిపోయే ప్రళయం శత్రువు లేని యుద్ధములో తెలియని మరణాలు..
మాటల కందని పెను దుర్మరణాలు. చల్లా చెదురుగా పడిన
బోగీలు హృదయ విదారక యుద్ధ భూమిలా ఆర్తనాదాలు తో ఘోషలు మిన్నంటే….
ఊహించని పెను విపత్తు సంభవించే ప్రళయం లా భగ్గుమన్న హృదయాలు..
చెదిరిన హృదయంలో కన్నీరు పారుతుంది.
అక్షరం వణుకుతూ మున్నీరై విలపిస్తుంది…
చరిత్రలో చూడని దుర్ఘటన కళ్ళ ముందు చెమ్మగిల్లిన కళ్ళలో
విషాదఛాయలు రక్తపు ముద్ద లు నేలపై చూస్తుంటే ఆకాశ గంగ నేలపై ఎర్రగా పారుతుంది…
తనువులు తెగిపడిన రణభూమిని తలపించే అవయవాలు కోల్పోయి
మూల్గులు వినిపించే శవాల దిబ్బను తలపించే స్మశాన భూమిలా క్షతగాత్రుల ఆర్తనాదం హృదయ భారమును పెంచే..
ఈ దుర్ఘటనలో ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో ఎన్ని హృదయాలు కన్నీరు మున్నీరై వినిపించాయో
ఆశల జీవితాలు మరుగున పడ్డాయో చాలించిన తనువుల్లో ఎన్ని కలలు కప్ప పడ్డాయో..
కనివిని ఎరుగని రీతిలో విషాద సంఘటన గాలిలో కలిసిన జీవుల ఆత్మల ఘోష
చనిపోయిన వారికి ఆత్మ శాంతి చేకూరాలి. వారి కుటుంబాలు ధైర్యంగా ముందుకు సాగాలి…
-గురువర్ధన్ రెడ్డి