సరస్వతీ కటాక్షం మూడో భాగం

సరస్వతీ కటాక్షం మూడో భాగం

ఆనందమైన జీవితములో అపశృతులు

తన జీవితము ఆనందంగా మనసుకు ప్రశాంతముగా సాగుతున్న వేళ, అపశృతులు ఎదురయ్యాయి. చిన్నపుడు ఆకతాయు తనంగా మిత్రులతో ఆడుతున్నప్పుడు బెంచు మీద నించి కాలు జారి క్రిందపడ్డాడు. దాంతో తలబద్ధలై నెత్తురు కారుతూండగా,ఆ నెత్తురుని చూసి మురిసిపోయాడు, తాను అంత బాగా ఆడాడు అని అనుకుని. కానీ కొన్ని క్షణాల తరువాత కళ్లు తిరిగి నేల మీద పడ్డాడు. అదే ఒక అపశృతి .బడి మాట అటు పక్కన పెడితే ప్రాణాలు ఉంటాయా అనే సందేహం ప్రప్రథమమైనది.ఆ దేవుణ్ణి దైవ వళ్ల బ్రతికి బయట పడ్డాడు. అప్పటి నించి ఆటకి దూరంగా బ్రతికాడు. మంచిగా దృష్టి మెత్తం చదువు మీద పెట్టాడు. పెద్దయ్యాక పెద్ద డాన్ లేదా, రుబాబు మనిషి గా అవ్వాల్సిన అతను గన్ను బదులు పెన్ను చేత పట్టి, జీవితము మనిషి విలువ తెలుసుకుని, గణాంకాలలో అత్యున్నతమైన గౌరవం, దక్కించుకున్నాడు. గిన్నిస్ బుక్ లో అత్యంత వేగంగా గణించే మనిషిగా చరిత్రకి ఎక్కాడు. అదే పట్టుదలతో ఐఐటీలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ఆ పోటీ పరీక్షలో సీటు సంపాదించుకోవడం ఒక ఎత్తు, ఆ అత్యున్నత శిఖరంలో తెలుగోడి జెండా పాతి, స్వర్ణ పతకం సాధించడం ఇంకో ఎత్తు. అందరి అభినందనలతో, ఆశీసులతో అతను రచనల పోటీలలో, పద్యాల పోటీలలో ప్రథమ స్థానాలు ప్రతీ ఏడాదీ దక్కించుకుని తన చుటూ ఉన్న వాళ్ళ నోర్లు ఎల్లబెట్టేలా చేసాడు.

మొదటి నాలుగు సెమెస్టర్లు మంచి మార్కులతో స్కాలర్షిప్ రాగా, “అతని మూడవ ఏది మొదటి సెమిస్టర్ లో ఒక ఇబ్బంది ఒచ్చింది. ఆ ఇబ్బంది పేరే అతిగా ఆలోచించడం. అదేంటి, ఇంత బాగా అతిగా, తన స్థాయికి మించి శాస్త్రవేత్తలు, సైనికులు, మరియు కళారంగ నిపుణులు లాంటి వారితో పోటీతత్వం పెట్టుకుని ఆలోచించే మేధావి, అర్థాంతరంగా ఇలా దిగజారిపోవడానికి కారణం ఏంటి అనేగా మీ ప్రశ్న. అప్పుడు అతని ఆలోచన లోకాన్ని ముందుకు నడిపే దిశగా, మరియు ఉన్నతమైన విలువతో కూడిన ఆలోచన, మరి ఇప్పుడు మామూలు మనుషులు ప్రవర్తన ఎంత స్వేచ్ఛగా ఎంత హాయుగా, స్థాయితో సంబంధం లేకుండా కేవలం ఆనందమైన జీవితము గడపాలనుకునే వారి ఆలోచనలతో కూడినది. చిన్న చిన్న విజయాలకి చంకలు గుద్దుకుని లోకాన్ని ఆక్రమించిన భావంతో ఉండే సగటు మానవ జీవితం ఎక్కడ, విజ్ఞాన శాస్త్రములో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతని జీవితం ఎక్కడ. ఇలాంటి ఆలోచనలవళ్ల అతను చదువును పక్కన పెట్టి, నిజాయితీగా బ్రతకడం నేర్చుకోసాగాడు. ఐదవ సెమెస్టరు స్కాలర్షిప్ రాకపోగా సప్లిలు పడటం వళ్ళ అతను మానసికంగా కృంగిపోయాడు. ఒక అమ్మాయి వైపు అతని దృష్టి – చాలా ఉన్నతంగా మారి, వారిని వారి స్థాయికి తగినట్టు గౌరవించాడు. తన కుటుంబాన్ని గౌరవించాడు కాబట్టే తన అమ్మ నాన్న తిట్టిన తిట్లని పాఠంగా మార్చి ఒక కవితగా రూపుదిద్ది ఒక కవి అయ్యి ప్రశంసా షత్రం పోందాడు, మానసిక కవి అయ్యాడు . మంచి వారికి, ప్రాయశ్చిత్త పరులకి ఆ దేవుడు కీడు చేయడు, కాబట్టి, రెండేళ్లలోపే డిగ్రీ సంపాదించుకుని తన ఉనికిని, సంస్కారాన్ని చేసుకున్నాడు.

– హరీశ్వర్

0 Replies to “సరస్వతీ కటాక్షం మూడో భాగం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *