గెలుపు
గెలుపు కోసం
నిన్ను నువ్వు గెలవాలంటే
నిరుత్సాహం విడనాడాలి.
కఠిన శ్రమను చేసెయ్యాలి.
ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.
ఏకాగ్రతతో పనిచెయ్యాలి.
పెద్దల ఆశీస్సులు పొందాలి.
దైవ ప్రార్థనలు చెయ్యాలి.
చెడు అలవాట్లు మానెయ్యాలి.
మంచి అలవాట్లు చేసుకోవాలి.
మితృల సహాయం పొందాలి.
అప్పుడే నిన్ను నీవు గెలవగలవు.
-వెంకట భానుప్రసాద్ చలసాని