గాయపడిన హృదయం
ఆడవాళ్ళకు ఆడవాళ్ళే
శతృవులు అనే నానుడి
ఒకోసారి నిజమేనేమో
అనిపిస్తుంది. బంధువులలో
కూడా ఈ విషయం అనేక
సార్లు ఋజువైంది. అందరూ
అనను కానీ కొందరు అత్తలు
తమ కోడళ్ళతో ప్రవర్తించే
విధానం చాలా దారుణంగా
ఉంటుంది. కోడళ్ళకు పగలే
చుక్కలు చూపించే అత్తలు
ఎందరో. అలాంటి అత్తలు
గమనించాల్సిన విషయం
ఏమిటంటే పెద్ద వయసులో
వారికి అన్ని పనులూ చేసి
పెట్టేది కోడళ్ళే. మరి అలాంటి
అప్పుడు కోడళ్ల హృదయాలను
గాయపరిస్తే భవిష్యత్తులో
ఆ కోడళ్లు తమ అత్తలను
బాగా చూసుకుంటారా అనేది
సందేహమే. ప్రేమ అనేది ఇచ్చి
పుచ్చుకునేది. ఇతరులపై ద్వేషం
చిమ్మితే అదే మనకు
తిరిగి వస్తుంది. ఆంతేకాదు
కొందరు కోడళ్ళు కూడా తమ
అత్తలను మానసికంగా చాలా
ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అత్తలు తమ మంచి గురించే విషయాలు
చెపుతారు అనే విషయం కోడళ్ళు గ్రహించాలి.
వయసు పెరిగే కొద్దీ
పెద్దలకు చాదస్తం పెరుగుతూ ఉంటుంది.
ఆ విషయం సహజ పరిణామం
అని కోడళ్ళు గ్రహించి తదనుగుణంగా
అత్తలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా
ఇంట్లో ఉండేది అత్తా కోడళ్ళే
కాబట్టి కలసి మెలసి ఉండాలి.
అత్తా కోడళ్ళు పోట్లాడుకుంటే
ఆ ఇల్లు నరకం అవుతుంది.
అదే వారిరువురూ కలసి ఉంటే
ఆ ఇల్లు స్వర్గం అవుతుంది.
ఏది ఏమైనా ఇంటిలోని వారి
సుఖ శాంతులు ఆడవారి చేతిలో ఉంటాయి.
-వెంకట భానుప్రసాద్ చలసాని