గాయ గీతం
రచయిత పేరు :- గురువర్ధన్ రెడ్డి
సమీక్షకులు :- మాధవి కాళ్ల
మనసు అయిన గాయం ఎప్పటికీ మారలేనిది.
కొన్ని మాటలతో , మరికొన్ని చేతలతో చేస్తారు కొందరు. వాళ్లే కావాలని బాధ పడడానికి ఎన్నో మాటలు ఆడుతారు. మనం బాధపడితే కళ్ళారు చూసి నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు.
కొన్ని బాధలు నాలుగు గోడలు మధ్య దాచుకున్న బయటికి చెప్పలేము. మరికొన్ని చెప్పుకున్న మనకు ఇంకా బాధ కలుగుతుంది దాంట్లో తప్పు నీదే అని అంటారు కాబట్టి.
చర్మం అయిన గాయాలని మందులతో పోగొట్టుకోవచ్చు కానీ మనసుకు అయిన గాయాలు మాత్రం అస్సలు పోగొట్టుకోలేను.
మనల్నిఏడిపిస్తూ నవ్వే వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్నారు. మంచి వాళ్ళు చెప్తేనేమే అసూయ పెంచుకుంటారు. చెడు మార్గం ఎంచుకున్న వాళ్ళకి మాత్రం ప్రోత్సాహం దొరుకుతుంది.
మనసుకి గాయం చేసిన వాళ్ళు సూటిపోటి మాటలతో చిత్రవధ చేస్తూ రాక్షస ఆనందం పొందుతారు.
అలాంటి వాళ్ళని ఊరికే వదలకుండా వాళ్ళ మాటకి మాట సమాధానం చెప్పి బుద్ధి చెప్పాలి. మనసుకి గాయం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు.
దాంట్లో కొందరు మంచివాళ్ళు , చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు. ఇతరుల మనసును గాయపరిచే ముందు తను కూడా ఒక మనిషి అని తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది.
గురువర్ధన్ రెడ్డి గారు ఈ కవిత గాయ గీతం చాలా బాగా రాశారు. ఈ కవిత నాకు బాగా నచ్చింది. ఆయన రాసిన ప్రతి లైన్ నాకు మనసుకి హత్తుకున్నాయి. మనం ఎలాగైనా శారీరకమైన , మానసికంగా అయినా గాయ పడవచ్చు.
–మాధవి కాళ్ల