గారడి
ఓటు కోసం నోటు అంటరు..
నోటు అందుకో కడుపు నింపుకో అంటరు..
ఓటు విలువ ఎరుగరు..
నోటు ఆశ మారదు..
గారడి వాడి చేతిలో
కోతిలా మారేవు..
అధికారమనే అవినీతికి
బానిస బతుకులు చేసేదరు..
చదువుకున్న మూర్ఖలారా
మతిలేని మస్తిష్కాలతో
బుర్ర లేని గొర్రెల్లా బతికేరు ఎందుకని..?
ప్రజలచేత ప్రజలు కొరకు..
ప్రజలే ఎన్నుకునే రాజ్యాంగం లో కీలుబొమ్మ అయ్యేవు ఎందుకు..?
అభివృద్ధి చెందుతున్న దేశం అంటూ
అనాగరికతతో అణగతొక్కేవారే అంతా..
మందు సీసా ముందు జీవితాన్ని హరిస్తుంది అని తెలుసుకో..
యువతరమా ఉడుకు రక్తం తో ఉరకలెయ్యక
జ్ఞానం తో అడుగు వేయి
నేటి తరానికి ఒక ఆయుధం నీవై
రేపటి తరాన్ని బతికించే జ్యోతి నీవై..
ఆధునిక కాలంలో అమ్ముడు పోయే
అంధకారం తొలగించి
అధఃపాతాళంలో ఉన్న
నీతి మొక్కకు నీరు పోసి
నిజాయితీ అనే వృక్షాన్ని పెంచి దేశమునే
కుటుంబానికి పురుడుపోసే బాధ్యత మనదే నేటి పౌరులదే ప్రజలదే..
ఓటు అవగాహన దాని విలువ
ప్రతి మనిషికి తెలియచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..
– సీత మహాలక్ష్మి