గణతంత్ర దినోత్సవం నీవెక్కడ

గణతంత్ర దినోత్సవం నీవెక్కడ

స్వతంత్రమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా
మా ఇష్టం వచ్చినట్టు జీవోలు రాసేస్తాం, మాకు నచ్చినట్టు పరిపాలించుకుంటాం.

మా చుట్టాలకు, పక్కాలకే సీట్లు ఇచ్చుకుంటాం, పదవులు ఇచ్చుకుంటాం, వేలు విడిచినా చుట్టాలకు తోడు,

పలికిన పక్కాలకి అధికారాలన్నీ అంటగట్టేస్తాం. లేనిపోని పదవులన్నీ సృష్టిస్తాం
ఏవేవో పథకాలు అంటూ టెండర్లేసి డబ్బులు నొక్కేస్తాం,
ఓటు వేసిన మనిషి నెత్తినె మొత్తుతాం,
పెళ్ళాల పేరిట పదవులు కొట్టేస్తాం, వాళ్ల నెత్తిన ముసుగేసి మూలకు కూర్చోబెెట్టేసి అధికారానంత దుర్వినియోగం చేసేస్తాం,

జనాల కళ్ళల్లో వాళ్ళ వేలితో వారినే పోడుచుకునేలా చేసేస్తాం,

స్వతంత్రమా క్షమించుమా మాకు నీతో పని ఏమీ లేదమ్మా…
పెద్ద పెద్ద ప్రాజెక్టు అంటూ డిజనులన్నీ మార్చేస్తాం
గంట గంటకు మాటలన్నీ మారుస్తూ అప్పులు ఎన్నో చేసేస్తాం
ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ పన్నుల బాటలో
ధరలన్నీ పెంచేసి, ప్రజల వద్దనే వసూలు చేసి
నిధులు ఏవీ లేవంటూ సెంట్రలునే తిట్టేస్తాం
వాడి మీదో రాయేస్తాం, వీడి మీదో “చెప్పే” స్తాం .
మళ్లీ ఎలక్షన్లు రాగానే ప్రజల నెత్తిన ఉరితాడేసి
మందు, బిర్యాని పొట్లాలు ఇచ్చి, వాడి
కాళ్లు పట్టుకొని బ్రతిమాలతాం,
మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగానే
పట్టుకున్న ఆ కాళ్ళనే వదిలేస్తాం.
ప్రజల స్వేచ్ఛను హరించి, మేము చెప్పిందే వేదమంటూ, అణగారిన వర్గాలను తొక్కేస్తూ,

అధికారాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, బానిస బతుకులు మీకంటూ రాజ్యాంగాన్ని మర్చెస్తాం,

మాకు నచ్చినట్టు అందరిని మార్చేస్తూ, బానిసలుగా చేసుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా,

దేశం కోసం ప్రాణాలు ఇస్తామంటూ కబురులెన్నో చెప్పేస్తాo…
చేతికి పగ్గాలిస్తే, అడ్డూ అదుపూ లేకుండా రైతులందర్ని కాల రాసెస్తాము.
అడిగిన వాడిని, ప్రశ్నించిన వాడిని అబద్ధపు కేసులు పెట్టి జైల్లో పెట్టేసాము..

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *