గమ్యం
నా గమ్యం ఏమిటి
నా లక్ష్యం ఏమిటి
అసలు గమ్యం అంటే ఏమిటి
చివరి వరకు జీవితం తో
పోరాడుతూ,కష్టాలు,కన్నీళ్లు
గొడవలు,అలకలు , అవమానాలు
అదృష్టలు, వేదనలు,ఆవేదనలు
తిట్లు,అభినందనల పోరాటమే
జీవిత లక్ష్యం మా, జీవిత గమ్యం మా
ఏది మన గమ్యం , ..
అన్ని విధాలా అందర్నీ సంతృప్తి పరచి
మంచి ఉద్యోగం ,డబ్బు సంపాదించి
అందరికీ అన్నీ విధాలా నష్టం రాకుండా
చేసి,చివరికి నీకంటూ ఏమి మిగుల్చుకోకుండ
నువ్వు చేరే గమ్యం ఒక్కటే అదే స్మశానం
అదే నీ గమ్యం , అదే నీ లక్ష్యం ,
ఎంత చేసినా, ఏన్ని అష్టశ్వార్యాలు
అనుభవించినా నువ్వు చేరేది
ఆరడుగుల నేల లోకే అనేది
మర్చిపోకు, మారకు ….
– భవ్యచారు