గమ్యం

గమ్యం

ఈ క్షణం.. చెబుతోంది పద పోదాం
చెబుతోంది ఈ క్షణం నీ నుండి నీకై పయనం సాగిద్దాం
గెలిచేద్దాం.. గెలిచేద్దాం… గెలిచేద్దాం

ఓటమి ఎపుడూ బాటసారే గా పోనిద్దాం
నీ కలల ద్వారాల్ని తెరిచేసి
ఓ గెలుపు వెలుగు వాకిట్లో ఆహ్వానిద్దాం
గెలిచేద్దాం.. గెలిచేద్దాం…గెలిచేద్దాం

పాదాల కింద చల్లని ఈ ధరణి చెబుతోంది పద పరిగెడదాం
జ్ఞాపకాల దొంతరలో సువాసనల జాతిరి వదిలేసి పరిగెడదాం
కలల పిడికిలి లో రేపటి తిన్నెలను వదిలేసి
నిన్నటి కటకపు గతాన్నే మరిచేసి
ఈ రోజు ఈ క్షణం లో బ్రతికేసి
చెబుతోంది ఈ క్షణమే నీకోసం నీకై పయనిద్దాం
గెలిచేద్దాం…గెలిచేద్దాం.. గెలిచేద్దాం

ఓ చుక్క నవ్వులనే త్రాగేసి
ఓ ముక్క ధైర్యాన్ని నమిలేసి
చల్ రే చల్ చల్ రే చల్ చల్ రే చల్
కష్టాల ఎక్కిళ్ళే పట్టేస్తే నీ ఊపిరి ఆగేనా
ఓ దోసిలి నీటినే తాగైవ
ఆ నీరే నీ కలల వర్షం రా
ఆ వర్షం మడులే కట్టేసి కలల సాగే

చేసేసి నీ కలల పంట పండించేయ్
చెబుతుంది ఈ క్షణమే
గెలిచేద్దాం గెలిచేద్దాం గెలిచేద్దాం

 

S. రహంతుల్లా

0 Replies to “గమ్యం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *