గమ్యం
ఎక్కడుంది నీ గమ్యం?
ఎటు వెళ్లాలి నీ గమనం?
బ్రతికినన్నాళ్లు బాధ పెట్టేవాళ్లే!
పోయాక మాత్రం పొగిడి పొగిడి..
పెడతారు..
ఇలాంటి వాళ్ల కోసమా?
కష్టించి పని చేసావు?
వాల్ల కడుపులు నింపి పెట్టావు..
నువ్వు తినక కూడ పెట్టిన..
ధనమంతా పంచి పెట్టావు..
వాల్ల కోసం అప్పులు చేసావు..
చివరకు నీ గమ్య స్థానానికి..
నువ్వు చేరి పోయావు..
ఏం మిగిలిందిక్కడ?
చూస్తున్నావా? పై నుంచి..
తిన్నింటి వాసాలు లెక్క..
పెడుతున్న..
మనుషుల గురించి..
మంచి తనమే లేని ఈ..
జీవుల తలంచి!!
-ఉమాదేవి ఎర్రం