గమ్యం
ఎవరి కోసం నీ ప్రయాణం?
ఎక్కడి దాకా నీ ప్రయాణం?
ఏది నీ గమ్యం?
ఎక్కడుంది ఆ గమ్యం?
ప్రేమ కోసమా?
నిను ప్రేమించే ..
వారి కోసమా?
ఎవరి కోసం?
నిను ప్రేమించే వాళ్లైతే..
నీ వెంటే ఉంటారు కదా!
నువ్వు ప్రేమించే వాళ్లైతే..
నీకోసం బ్రతికే ఉంటారు కదా!
మరి ఎవరి కోసం?
నీ బ్రతుకు నీకే..
భారమైనప్పుడు..
నువ్వింకా ఎవరి కోసం..
నీ ప్రయాణం సాగించాలి?
నీ కోసం మాత్రమే నువ్వు..
బ్రతకడం నేర్చు కోవాలి..
ఎవరి కోసం ఎక్కడా..
ఆగకుండా నీ గమ్యం ..
నువ్వు చేరుకో!!!
-ఉమాదేవి ఎర్రం