గజల్
ప్రేమికునిగా లేకున్నా..కాముకునిగా మిగలనేల!
రామునిగా మారకున్నా..రావణునిగా మిగలనేల!
సర్వస్వం వదులుకునే నాయకుడే నాయకుడు..
పరసొత్తుకు ఆశపడుతూ..భిక్షకునిగా మిగలనేల!
తండ్రిమాట జవదాటని..కొడుకు ముచ్చటేమోలే..
ఆశ్రమాల కప్పజెప్పు ముష్కరునిగా మిగలనేల!
ఎంతచదువు చదివితేమి బుద్ధి చిన్నదైనప్పుడు..
క్షణికమైన మోహంతో..రాక్షసునిగా మిగలనేల!
పాదుకలకు ప్రణమిల్లే..తమ్ముడివే కాకున్నా..
పడదోస్తూ లాగుకునే..తస్కరునిగా మిగలనేల!
ఐతిహాసిక పురాణాలు..మనజ్ఞాన ప్రసాదాలు..
గ్రహించేటి శక్తిలేక ..బాధితునిగా మిగలనేల
దేవతవే కాకున్నా..అమ్మవేగ ఓవిజయా..
ఆచరణే బాటకదా..బోధితునిగ మిగలనేల
–గురువర్ధన్ రెడ్డి