ఫుల్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ లూప్ లపేట!!!!
రేటింగ్ : ౩/5
బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ మంచి ఊపు మీద ఉంది ఆమె నటించిన సినిమాలు వరస పెట్టి ఓటిటిలలో రిలీజ్ అవుతున్నాయి. ఆమె మాంచి కథా బలం అలాగే తన పాత్రలో కొత్తదనం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకు పోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన లూప్ లపేట కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ : ఈ సినిమా 1998లో వచ్చిన జర్మనీ సినిమా అయిన రన్ లోల రన్ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీయడం జరిగింది. ఇక కథగా చెప్పుకుంటే సావి (తాప్సీ) మీద తండ్రి ఎన్నో కలలు పెట్టుకుని రన్నర్ గా ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు కానీ ఆ పరుగు పందెంలో ఆమె అనుకోకుండా ఓడిపోతుంది.
అప్పటి నుంచి తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెరుగుతుంది దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయంలో సత్య (తాహిర్ బాసిన్) సేవ్ చేస్తాడు దాంతో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు.లైఫ్ లో ఎప్పుడు షాట్ కట్ లో గెలవాలి అనుకునే సత్య తన బాస్ ఇచ్చిన ఒక పనిలో అతన్ని మోసం చేసి 50 లక్షల రూపాయలతో ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు.
కానీ, ఆ డబ్బు వేరే వాడు కొట్టేస్తాడు దాంతో ఏం చేయాలో తెలియక అతని సావికి ఫోన్ చేస్తాడు అప్పుడు ఆమె తన బాయ్ ఫ్రెండును ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ : ముందు చెప్పుకున్నట్టు ఇది రన్ లోలా రన్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీశారు అందుకే సావి తన బాయ్ ఫ్రెండ్ ను కాపాడడానికి ఇలా కాకుండా ఇలా చేసుంటే ఏం జరిగేది అన్న పాయింట్ లో సినిమా నడుస్తుంది.
దాదాపుగా ఇలాంటి పాయింట్ తోటే మన దగ్గర పూరీ జగన్నాద్ రవితేజ తో దేవుడు చేసిన మనుషులు అనే సినిమా తీశారు. అయితే ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి అద్భుతమైన మేకింగ్ అలాగే రేసి స్క్రీన్ ప్లే ఇంకా స్టైలిష్ డైరెక్షన్ చాలా వరకు సినిమాను బోర్ కొట్టకుండా చూసేలా చేసింది.
అలాగే సీన్స్ ను బాగా ఏలివెట్ చేసి మ్యూజిక్ కూడా అద్భుతంగా కుదిరింది ఇక ఎడిటింగ్ కూడా మంచి రిథమ్ తో ఉండడం మరొక హైలైట్ అని చెప్పుకోవచ్చు.
తన బాయ్ ఫ్రెండ్ ను సావి కాపాడే ప్రాసెస్ లో జాకబ్ లాగే జూలియా లవ్ స్టోరీ ఇంకా జ్యూవెలరీ షాపు ఓనర్ కొడుకులు తండ్రినే మోసం చేసి షాప్ లో డబ్బులు కొట్టేయాలని అనుకోవడం మధ్యలో తాప్సిని వెంటాడుతూ ఎస్.ఐ. పాత్ర ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే పరిగెట్టడంతో సెకండాఫ్ కొంచెం రిపీట్ అవుతున్నట్టు అనిపించినా సినిమా చివరకు మంచి ఫీలింగ్ నే ఇస్తుంది.
ఇక రన్ లోల రన్ సినిమాతో కంపేర్ చేస్తే ఇందులో ఇలా జరిగుంటే ఏమయ్యేది అనే విషయాలు తాప్సీ పాత్రకు తెలిసిపోయినట్టు దాంతో మరొక సారి అవే సిట్యు వేషన్స్ రిపీట్ అవకుండా తాప్సీ జాగ్రత్త పడినట్లు చూపించారు.
నటీనటులు :
ఆల్మోస్ట్ సినిమా మొత్తాన్ని తాప్సీ చాలా వరకు తన భుజాలపై మోసిందని చెప్పొచ్చు. ఒక లవర్ గా తన బాయ్ ఫ్రెండ్ ను కాపాడడానికి ట్రై చేయడం మరొక వైపు తండ్రితో ఉన్న గొడవలను ఎమోషనల్ గా డీల్ చేస్తూ అటు కామెడీ అయినా ఇటు ఎమోషన్ అయినా ఆమె అద్భుతంగా నటించింది.
ఇక తాప్సీ బాయ్ ఫ్రెండ్ గా నటించిన తాహిర్ బాసిన్ నటన కూడా చాలా బాగుంది.మరొక ముఖ్య పాత్రలో నటించిన మన హైదరాబాద్ అమ్మాయి శ్రేయ ధన్వంతరి సినిమాలో ఒక లెంగ్త్ డైలాగ్ సీన్ లో అదరగొట్టింది.
ఇక ఆమె బాయ్ ఫ్రెండ్ గా చేసిన జాకబ్ అలాగే సత్య బాస్ గా చేసిన నటుడు ఇలా అందరూ దాదాపు తమ పాత్రల్లో బాగానే నటించారు. సినిమా విజువల్స్ స్టైలిష్ గా అద్భుతంగా ఉండి గోవాను సరికొత్తగా చూపించాయి ఇక మ్యూజిక్ అందించిన రాహుల్ పాల్స్, మయాంక్,సిదంత్,సంతను ప్రతీ సీన్ కు మంచి మ్యూజిక్ చేశారు సాంగ్స్ కూడా బాగున్నాయి, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
తాప్సీ మిగతా నటీనటుల ప్రతిభ
స్టైలిష్ విజువల్స్
డైరెక్షన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
రేసీ స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
కొన్ని సార్లు రిపీట్ గా అనిపించే కథనం
సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ అవడం
పంచ్ లైన్ : టైం పాస్ ఎంటర్ టైనర్
రిలీజ్ : 4 ఫిబ్రవరి, 2022
నటీ నటులు : తాప్సీ, తాహిర్ బాసిన్, శ్రేయ ధన్వంతరి, దిబెందు తదితరులు
సంగీతం : రాహుల్ పాయ్స్, నరిమన్ ఖంబట, మయాంక్, సంతను
దర్శకత్వం : ఆకాష్ భాటియా
నిర్మాతలు : సోనీ పిక్చర్స్, ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్
రన్ టైం : 2 గంటల 11 నిమిషాలు
ఎక్కడా : నెట్ ఫ్లిక్స్