ఫీలింగ్

ఫీలింగ్

ఆశ చేరనంటుంది
ఆకలి తీరనంటుంది
కోపం పోనంటుంది
పలుకు బంగారమవుతుంది
చిమ్మ చీకటి చిదిమేస్తుంటుంది!

కాలం కదలనంటుంది
ఆలోచన సాగనంటుంది
చిత్తం చికాకుపడుతుంటుంది
మొత్తంగా నువు బిగుసుకునుంటావు!

సరిగ్గా అప్పుడే అరుణిమల ఆకాశం
సిగ్గుపడుతుంటుంది
కాలు కదిపి
వొళ్ళు విరిచి
కనులు తెరిచి చూశావో
ఉదయవీణను మీటుతూ
భానుడి చిలిపినవ్వు పలకరిస్తుంది
ఒడలు పులకరిస్తుంది
బళ్ళు ఓడలయిన ఫీలింగ్ వెంటే ఉంటుందిక
ఫీనిక్స్ పక్షిలా మనసు పైకెగురుతుందిక

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *