ఫాదర్స్ డే

ఫాదర్స్ డే

ఫాదర్స్ కి ఒక రోజు ఏం సరిపోతుంది? జీవితమంతా మనం పుట్టడమే ఒక అధృుష్టంగా భావించి అహర్నిశలు మన కోసం కష్టపడి మన మంచి కోరి కోప్పడి తను చెడ్డ వాడవుతూ బ్రతికిన నాన్న.. ఆ నాన్నకు ఒక్క రోజా? నా కైతే మా నాన్న ఎనిమిదో తరగతి లోనె దూరమయ్యారు కానీ తనున్నన్ని రోజులు నాకందించిన ప్రేమ మాత్రం వందేళ్లకంటే ఎక్కువే అవుతుంది..

ఎందుకంటె నేను వారి సంతానంలో చివరి దాన్ని పదకొండో నంబరుని అలాగని అందరం ఉన్నామనుకోకండి  అయిదుగురమే ఉన్నాం! మా చిన్న అన్నయ్య తరువాత మిగిలిన వాళ్లు పుట్టి చనిపోయారట చివరకు నేను బ్రతికానట..
పాపం నేను బ్రతకడానికి మా అన్నయ్యకు వెన్నులో కాల్చారట మా అక్కలు..

ఏంటో అన్నీ కథలు కథలే! కానీ మా నాన్న గారు పంచాంగాలు చూస్తుండే వారు నా పుట్టుక వారి పేదరికాన్ని దూరం చేస్తుందని తెలుసు కున్నారట అలాగే జరిగింది.. అందుకే తను నన్నొక లక్ష్మీ దేవిలా భావించి చిన్న మాట కూడా అనే వారు కాదు.. మా నాన్నగారి దగ్గరే తినడం పడుకోవడం అంతాను..

అన్నట్టు మాకో రేడియో కూడాను అదీ మాతో పాటే మా బెడ్ లో పడుకునేది దానికి కూడా చెద్దరు కప్పేవాళ్లం… ఆరు బయట ఆకాశాన్ని నక్షత్రాలను చూస్తూ పడుకునే వాళ్లం.. మిగతా నలపగురు చాలా భయంగా పెరిగారు నేనేమో
అల్లారు ముద్దుగా పెరిగాను.. 

మా నాన్నగారు నన్నలా చూసేవారు నాకు కూడా మా నాన్నగారంటె పిచ్చి నా ఫోన్ పైన కూడా మా నాన్నగారి ఫోటోనె ఉంటది.. నాన్నగారు పోయాక దాదాపు పిచ్చి దానిలా అయ్యానట మా అన్నయ్యలు మళ్లీ నన్ను మామూలు మనిషిని చేయడానికి చాలా కష్టపడ్డారు..

అదండి మా నాన్న గారి స్టోరీ! ఇప్పుడు చెప్పండి వందేళ్లకు సరిపోను ప్రేమను నాకు పంచారు కదా!

– ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *