ఎవరిని తప్పుపడదాం?
ఆ తండ్రి
నెలరోజులుగా ఆస్పత్రి మంచంపై
చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నారు.
కూతుళ్ళు , కొడుకులు
దేశ విదేశాల నుంచి
ఆఘమేఘాలపై వచ్చి వాలారు….
కన్నీరు ఒలికింది
కాలం కరిగింది
తిరుగు ప్రయాణం టిక్కెట్టు రెపరెపలాడింది.
ఇంకా ఆయుష్షు తీరని తండ్రి ప్రాణంలా…
ఉద్యోగ ధర్మం ఊగిసలాడింది
తల్లి కళ్ళలోని
ఆశా నిరాశల నడుమ నిస్సహాయంగా…
మనసు చంపుకుని
ఎక్కడి నుంచో తెలివిని అద్దెకు తెచ్చుకుని
మరెక్కడి నుంచో
రెండు బలీయమైన చేతులు పురామాయించుకుని
బలవంతంగా నేట్టివేయబడ్డారు.
వంతులవారీ రాకపోకల
ప్రణాళికలు సిద్ధం చేసుకుని…
ఎవరిని తప్పుపడదాం?????
భగవంతుడినా? బతుకు సమరాన్నా?????
-గురువర్థన్ రెడ్డి