ఎప్పుడు???
ఈ పండగలు ఏమో కానీ ఏది ఎప్పుడు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందో. కొందరు ఒక రిజు ముందు చేస్తే ఇంకొందరు మరొక రోజు చేసుకుంటున్నారు.
పండితులు మాత్రం ఎప్పుడూ తేదీలు మారవు, పెద్దలు ఏలా చెప్పారో అలాగే చేసుకుందాం అని అంటున్నా, కూడా కొందరు ఇలా వేరు వేరుగా చేసుకుంటున్నారు.
విభజన తర్వాత ఇది మరింత ఎక్కువ అయ్యిందని చెప్పవచ్చు. ఈ యాడాది బతుకమ్మ, దీపావళి, దసరా, ఇదోగో ఇప్పుడు సంక్రాంత్రి కూడా ఇలాగె చేసుకుంటున్నాం.
నిజానికి 13,14,15 తెదిలలోనే మనం భోగి, సంక్రాoత్రి , కనుమ, ముక్కనుమ జరుపుకుంటాం. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం, సంప్రదాయం. ఇది ఎవరు కాదనలేని మాట…
అధిక మాసం వల్ల కాని, మిగిలిన విషయాల వల్ల కాని పండగలు మారవు అనేది నిజం. మీరు కూడా ఒకసారి ఆలోచించండి.
కొన్నేళ్ళుగా ఇది జరుగుతుంది. ఇప్పుడు మారమని, మార్చమని అనుకోవడం అవివేకం అనిపిస్తుంది. మిగిలిన పండగలు కూడా తేదీలు వేరని అన్నా కూడా ఆ సమయానికి అందరం అదే రోజు జరుపుకున్నాం.
అలాగే జరుపుకోవాలి కూడా… మకర సంక్రాంత్రి రోజే మకర దీపం దర్శనం ఇస్తుంది. అది కొందరు నమ్మక పోయినా ఇది ఎన్నేళ్ళుగానో జరుగుతున్నది కదా ఒక్క సారి ఆలోచించండి. ఆ మాకెందుకు ఆలోచన, నలుగురితో నారాయణ అంటారా అది మీ ఇష్టం..