ఎన్నో కలలు
చిన్ననాటి నుండే..
పెద్దయ్యాక అలా
ఉండాలి ఏదో అవ్వాలి
ఏదో చేయాలి అని
ప్రణాళికలు తయారు చేసుకుంటూ..
ఎన్నో కలలు కంటూ
ఊహలలో విహరిస్తూ
ఉండగా…
కాలం కలిసి రాక
అనుకున్నదొక్కటి
అయ్యింది ఒక్కటాయే..!!
చేయూతనిచ్చి అండగా నిలబడే వారు ఎవ్వరు
లేకపాయే..!!
నా వెంట ఉన్న వాళ్లకైనా
చెప్పుకుందామంటే..
సిగ్గు బిడియం అడ్డొచ్చే..!!
ఎంత తెలివి ఉన్నా
ఉపయోగం లేక
ఊహించుకున్నదంతా
వ్యర్థమైపోయే..!!
ఏమి చేయలేక
నిస్సహాయక స్థితిలో
కొట్టుమిట్టాడుతూ..
ఎదురించలేక
నాకు నేను సర్ది
చెప్పుకుంటూ
కాలం గడుపుతుంటిని
చిన్ననాటి ఊహలన్నీ
చెదిరిన కల మిగిలిపోయే..!!
******
-బేతి మాధవి లత