ఎన్నెల
రాత్రి
చుక్కలన్నీంటిని కోసుకొని
కిందికి దిగి నడుస్తున్నాను
గట్టు చివరిదాక
వెంబడించిన సందమామ
ఆఖరికి చతికిలపడి ఆగిపోయాడు
అతడిని
ఒక్కడ్ని చేశాననే గర్వం
నేత్తిమీదకెక్కి కూర్చుంది
పగలబడి
నవ్వుకుంటూ నవ్వుకుంటూ
కొండలను గుట్టలను దాటుతున్నాను
ఒక్కసారిగా
పురిటినొప్పుల కేకలోంచి
పసిగొంతు ఏడ్పు..
గూడెం లోపలికి
అడుగులేసి చూశాను
పసిముద్దను
మెల్లగా రెండు చేతుల్లోకి తీసుకున్న ముసలవ్వ
ఆకాశంవైపుకెత్తి ‘ఎన్నెల’ అని పిలిచింది!
-కిషోర్ రెడ్డి