ఎందుకే మనసా

ఎందుకే మనసా

 

మనసు,తనువు ఏకమయ్యే వేళ
ఎదలో ఎన్నో మధురానుభూతులు
నీ కన్నుల్లో కోటి కాంతులు నన్ను తాకే వేళ
మాయని మచ్చేదొ నిన్ను హఠాత్తుగా మాయం
చేసిన వేళ.. హఠాత్తుగా మెలకువ నుండి లేచిన
వేళ..పక్కనే నువ్వు హాయిగా నిద్రలో నవ్వడం
చూసి, హమ్మయ్య అనుకుంటూ నీ హృదయం
పై .. తలవాల్చుతూ నవ్వుకున్నా.. నీ నుండి నన్నెవరూ వేరు చేయలేరని….కానీ.. కానీ
వేదననూ అంతా నాకే మిగిల్చి, ఒంటరిని చేసి వెళ్ళిపోయాక , శూన్యమైన ఇంటితో పాటు ,నా మనసు నన్ను వెక్కిరించింది ..
ఎందుకే మనసా..తుళ్ళి పడతావు,
తొందర పడ్డావంటూ నా నీడే నన్ను వెక్కిరించింది బిగ్గరగా నవ్వుతూ…

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *