ఏకమ్ సినిమా రివ్యూ -రేటింగ్ ?
సమాజం గురించి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని సూటి గా సుత్తి లేకుండా చెప్పాలి. అలాగే దేవుడు గురించి , అతని లీలల గురించి చెప్పాలన్నా కూడా సూటి గా చెప్పాలి. కానీ అన్ని కథలు కలగాపులగంగా చేసి , కలగూర గంప లా చెప్తాం అంటే రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది ఈ సినిమా కథ . ఇంతకీ కథ ఎంటి ?
కథ ఏంటి!
జీవితం లో అందర్నీ కోల్పోయి, ఉద్యోగం లేకుండా నా రూటే సెపరేటు అంటూ ఆనందం వెతకడానికి వెళ్ళే హీరో లాంటి అబ్బాయి. ప్రియుడు మోసం చేయడం తో పాటు తన వీడియో నెట్ లో రావడం తో చావు ను వెతుకుతూ వెళ్ళే ఒకమ్మాయి. కాఫీ షాప్ పెట్టుకోవాలని లక్ష్యం తో పాటు పడే ఇంకో అమ్మాయి.
ఆమెకు హెల్ప్ చేసినట్టు నటిస్తూ తనను తన చేతుల్లో బందీగా ఉంచలనుకునే అబ్బాయి. ఎన్నో పాడు పనులు చేస్తూ ఇదేనా జీవితం అనుకునే ఇంకో మధ్యవయసు అతను. దేవుడి గుళ్ళో సేవ చేస్తూ ఉద్యోగం కోల్పోయి దానికి కారణం దేవుడే అంటూ దేవుణ్ణి స్మశానం లో పూజించే ఒక వృద్దుడు. వీరందరి ఆశయం లక్ష్యం ఒక్కటే అదే జీవితం లో ఆనందాన్ని కోరుకోవడం. మరి వారికి ఆనందం దొరికిందా లేదా అనేది సినిమాలో చూడాల్సిందే.
ఎవరెలా చేశారు?
పాత కొత్త వారితో చేసిన ఈ సినిమా లో పాష్ పోరిస్ అనే యూ ట్యూబ్ లో హల్చల్ చేసిన అమ్మాయి( ఈ అమ్మాయి కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.). కి యాక్షన్ చేసే ఛాన్స్ ఉన్నా చేయలేదు. ఏదో చేసాను అంటే చేసాను అన్నట్టు చేసింది. ఇక తనికెళ్ళభరణి గారు, డేవిడ్ పాత్ర బాగానే ఉన్నారు. గణేష్ పాత్ర అతను కూడా పర్లేదు అనిపించాడు.
హీరో లాంటి అబ్బాయి మాత్రం ఏమీ చేయలేదని అనిపించింది. ఇక కాఫీ షాప్ సీన్స్ మాత్రం ఎందుకో అర్దం కాదు. ఎంతసేపు అందులోనే ఉన్న ఆ నలుగురు వ్యక్తులే మాట్లాడుకోవడం, వాళ్ళే కాఫీ తాగుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
పోనీ కస్టమర్స్ లేరా అంటే అది కాదు అప్పుడప్పుడు ఉన్నట్టు చూపిస్తారు. డైలాగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. మన సహనానికి పరీక్ష అని చెప్పవచ్చు. హిరణ్య కశిపుడు కథలు చదివి హత్యలు చేసినవాడు మారాడు అని చెప్పడం దానికి అంటే ఆ కథల పుస్తకాన్ని ఏకం అని పిలవడం, అందులో ఏముందో చెప్పక పోవడం , అసలు రవి అనే వ్యక్తి ఎవరు ? అతన్ని డేవిడ్ ఎందుకు చంపాడు ? అని క్లారిటీ లేదు. పోనీ హీరో తండ్రి రవి నా అంటే అది కాదు. అసలు రవి అనే వ్యక్తిని ఎందుకు చంపాడు? అసలు డేవిడ్ కి ఉన్న గతం ఏంటి అనేది చూపించలేదు. చివరికి దేవుడు ఒక్కడే అతని రూపాలు వేరంటూ తనికెళ్ళ భరణి గారు చెప్పడం ఒక్కటే బాగున్నట్టు అనిపించింది.
అలాగే హీరో చిన్నప్పుడు సన్యాసి నీ చూసి నీలాగా ఆనందంగా ఉంటాను అనడం ఎందుకు ? బైరాగి ఆకారం లో ఉన్నది దేవుడే అని మనం అనుకోవాలా ఏది క్లారిటీ గా లేదు. ప్రతి మనిషి జీవితం లో ఆనందాన్ని వెతుకుతాడు, పనిలో కానీ, లేదా అతని అభిరుచిలో కాని ఎక్కడ తనకు బాగా అనిపిస్తుందో దాన్ని వెతుకుతాడు. ఇక్కడ డైరెక్టర్ మాత్రం మన సహనంలో ఆనందాన్ని వెతికాడు అని భావించవచ్చు.
అలాగే హీరో ఆనందం వెతకడానికి సన్యాసిగా మారిపోయేదానికి సినిమా ఎందుకు ? అసలు వాళ్ళ సమస్యలకు , దేవుడికి సంబంధం ఏమీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. మొత్తానికి ఏకమ్ కథ ఏ పస లేకుండా చప్పగా ఉంది..
Good, సమయం వృధా చేయకుండా కాపాడారు.