ఈరోజు అంశం:- వెన్నెల
వెన్నెల ఈ పదం వినగానే ఆకాశంలో విరగకాసే వెన్నెల, చుట్టూ చుక్కల నడుమ రేరాజులా వెలిగిపోతూ, చల్లని వెన్నెల ప్రసరించే నెలరాజు చూపులు తట్టుకోలేక కొంగు జార్చే పడతులు ఎందరో…
వెన్నెలను చూపుతూ గోరు ముద్దలు తినిపించే తల్లులు, వెన్నెల్లో గోదావరి అందాలు, ఆ ఇసుకు తిన్నెల పై ఆడుకునే ఆటలు, చుక్కలను లెక్క బెడుతూ ఆరుబయట నులక మంచం పైన ఉన్న పిల్లలకు వెన్నెల గురించి కథలు చెప్పే తండ్రులు, అదే వెన్నెల్లో కూర్చుని పాత విషయాలను గుర్తు చేసుకునే అవ్వ తాతలు, ప్రియుడి రాక కోసం ఎదురు చూస్తూన్న ప్రేయసి విరహతాపాలు….
అబ్బో ఎన్నని చెప్పగలము, ఏమని వర్ణించగలము. వెన్నెలతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు. అలాంటి వెన్నెల గురించి మీ అందమైన అనుభవాన్ని కవిత గానీ, కథ గా గానీ రాసి పంపండి.
వెన్నెలతో నా అనుభవాలు అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం తెలుపండి.