ఈరోజు అంశం:- సంతృప్తి
మనిషి సంతృప్తి గా ఎప్పుడు ఉంటాడు? అసలు మనిషికి సంతృప్తి అనేది ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే చదువులో పక్కవాడి లాగా బాగా చదవాలి అని ఉంటుంది.
అయ్యో వాడికి సీట్ వచ్చింది నాకు రాలేదు అనే బాధ ఉంటుంది. తర్వాత ఉద్యోగంలో లక్ష రూపాయలు జీతం ఉన్నా ఇంకా కావాలనే అసంతృప్తి ఉంటుంది. పెళ్లిలో ఇంకా ఎక్కువ కట్నం వస్తే బాగుండు అనే బాధ ఉంటుంది.
పిల్లల విషయంలో అమ్మాయి పుడితే అబ్బాయి పుట్టలేదని అసంతృప్తి ఉంటుంది. వారి చదువుల విషయం లో ఇతరులతో పోల్చడం ఒక అసంతృప్తి గా ఉంటుంది. ఇల్లు విషయం లో సొంత ఇల్లు లేదనే సంతృప్తి, ముసలి వయసులో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉంటుంది.
ఇలా ప్రతి దాంట్లో ఇతరులతో పోల్చుకుంటూ సంతృప్తి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి మీరు కూడా అలాంటి జీవితాన్ని ఎప్పుడైనా అనుభవించారా? ఎవరితో పోల్చుకున్నారు? ఇలా పోల్చుకోవడం ఎంత వరకు సమంజసం? రచన ద్వారా తెలియజేయండి…