ఈరోజు అంశం:- పొగడ్త
పొగడ్త ఈ పదం చాలా మంది ఇష్టపడతారు. పొగడటం అనేది ఒక కళ, దాన్ని వంట బట్టించుకున్న వాళ్ళు ఎదుటి వారిని పొగుడుతూ తమ పనులు చేయించుకుంటారు.
పొగడ్త అనేది చిన్న పిల్లాడి నుండి మొదలు అవుతుంది. మా బంగారమే మా కన్నయ్యనే అనే తల్లి మాటల నుండి పిల్లాడి మనసు పొగడటం అనే ఒక ట్యూన్ కి మారిపోతుంది.
తెల్లవారి తల్లి అలాంటి మాటలు మాట్లాడకుండా మామూలుగా అన్నం పెడితే తినకుండా మోరాయిస్తాడు పిల్లాడు. మళ్ళీ తల్లి మా మంచి కన్నయ్య కదు అంటూ పొగడటం స్టార్ట్ చేస్తుంది.
ఇలా ప్రతి రోజూ పిల్లాడి మనసులో ఆ మాటలు అనేవి నాటుకుంటాయి. అలా వారి మనసు ట్యూన్ అవుతుంది. పాపం తల్లి పిల్లాడు తినాలని అలా అంటుంది కానీ భవిష్యత్తు గురించి ఆలోచించదు.
ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక పొగడటం అనే మత్తుకు బానిస లాగా మారి పొగిడిన వారికి అన్నీ పనులు చేస్తూ ఉంటారు. ఇవి ఒక్కోసారి అతిగా అయ్యి వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి.
అయితే మరి దేవుణ్ణి కూడా పొగుడుతున్నాము కదా అనేవాళ్ళు కొందరు ఉంటారు. నిజమే దేవుణ్ణి పొగడటం వల్ల మన పనులు జరుగుతున్నాయా లేదా అనేది పెద్ద ప్రశ్న…
మరి మీ జీవితం లో కూడా పొగడ్తలకు లొంగి ఏదైనా పనులు చేసి, మీ తల పైకి తెచ్చుకున్నారు లేక అలా పోగటం వల్ల మీ పనులు జరిగాయా జరిగితే అవి ఎలాంటి పనులు అనేది మీ రచన ద్వారా తెలియజేయండి. అది కవిత గా అయినా కథ రూపంలో అయినా రాయండి.