ఈరోజు అంశం:- పేద కుటుంబం
పేద కుటుంబం అనగానే కటిక దరిద్రంతో ఉన్న వాళ్ళు గుర్తుకు వస్తారు చాలా మందికి. కానీ కటిక దరిద్రంతో ఉన్నా కలిసి మెలిసి ఉంటూ, కలతలు లేకుండా, ఉన్న రోజు తింటూ, లేని రోజు పస్తులు ఉంటూ అందులోనే ఆనందం వెతుకుతూ, ఉన్నన్ని రోజులూ నవ్వుతూ బతుకుతూ కష్టపడి పని చేసుకుంటూ, ఎలాంటి స్వార్థం లేకుండా, ఒకరి కోసం ఒకరు బతుకుతూ, డబ్బంటే వ్యామోహం లేకుండా, పొద్దంతా కష్టం చేసి, రాత్రి కాగానే నాలుగు మెతుకులు తిని, ఆద మరచి, ఎలాంటి చికూ చింత లేకుండా కంటి నిండా నిదుర పోయే వాళ్ళు ఎంతో ధనవంతులు…
ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా కావాలని ఆత్ర పడుతూ, స్వార్ధ చింతనతో, ఒకే ఇంట్లో ఉన్నా ఒకరి పై ఒకరు కుట్రలు చేస్తూ, ఒకరిని మోసం చేస్తూ, పది మందిలో గొప్ప అనిపించుకోవాలి అని డబ్బులు ఖర్చు పెట్టి పదవులు కొనుక్కున్న వాళ్ళు, ఎప్పుడు ఎవడు వచ్చి చంపేస్తాడో తెలియని భయంతో క్షణం క్షణం నరకం అనుభవిస్తూ, కడుపు నిండా తినాలని ఉన్నా అర్ధం లేని రోగాలతో కడుపు నిండా తినలేక, భయపడుతూ బతికే బతుకు కోసం కంటి నిండా నిద్ర కూడా పోకుండా, తీవ్ర అశాంతి తో బతికే వారు పేద కుటుంబం తో సమానం. కాదంటారా?
మీ అభిప్రాయాన్ని పోస్ట్ ద్వారా తెలుపండి.
Chala baga chepparu pedarikam aney daniki artham 💐👌👍
ధనిక, పేద అని వ్యత్యాసం గురించి కాదు గాని…నేను నమ్మేది మాత్రం…
“పైసా అప్పు లేని వాడు నిత్య సంపన్నుడు”