ఈరోజు అంశం:- ఒంటరి బతుకు
పది మందిలో బతికినా కూడా చాలా మంది ఒంటరి తనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవడం లో వాళ్ళు కోల్పోతున్న దాన్ని గుర్తించలేరు. అలాగే వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారో కూడా వాళ్లకు ఒక స్పష్టత ఉండదు.
అలా పది మందిలో ఉన్నా ఒంటరి జీవితాన్ని ఆస్వాదించ లేని అశక్తులు వాళ్ళు , వారికి ఒక లక్ష్యం , ఆశయం లాంటివి ఉండవు. యెప్పుడూ నిర్లిప్తత గా ఉంటూ ఉంటారు.
ఎవరితో కలవకుండా మాట్లాడకుండా మనసు విప్పకుండా ఉంటారు. వారిని చూస్తున్న ఎదుటి వారికి కూడా విరక్తి భావం వస్తుంటుంది..
కానీ అంత మంది లో ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవించకుండా ఉన్న వారికంటే, ఎవరూ లేని వారి జీవితం. ఏలా ఉంటుందో అని గమనించాలి.
ఒంటరి జీవితం అంటే ఎవరూ లేని వాళ్ళు కాదు. అందరిలో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అయ్యే వారి జీవితం కూడా కాదు. సంపాదన కోసం రేయి పగలు కష్టపడి,అంతా సంపాదించాక , ఆస్తి ని అందరూ పంచుకున్న తర్వాత , వయసుడిగినది అంటూ ఆశ్రమాల్లో వదిలేసిన వారి బతుకు ఒంటరి బతుకు వారిది ఒంటరి జీవితం ..
కానీ వాళ్ళు కూడా కాలానికి అనుగుణంగా ముందుకు వెళ్తూ మలి వయసులో కూడా అందరితో కలిసి నవ్వుతూ ఉండడం నేర్చుకున్నారు.
మరి ఒంటరి జీవితం అంటే ఏమిటి.. ఏందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవడమా , లేదా ఎవరు లేకుండా ఆశ్రమాల్లో ఉండడం ఒంటరి జీవితమా ..
మీ అభిప్రాయాన్ని మీ రచన ద్వారా తెలియజేయండి
Meeru cheppindhi nijame bhavya garu … Chala bhaga chepparu 👌👌👌