ఈరోజు అంశం:- నీతి
ఈరోజుల్లో నీతి అనే మాట ఎక్కడా వినిపించడం కనిపించడం లేదు. నీతిగా ఎవరూ బతకడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతున్నది. నీతి గా ఒక్కరూ లేరు.
నీతి అనేది మన జీవితాలలో భార్య భర్తల దగ్గర లేదు, తండ్రి కొడుకుల మధ్య లేదు ప్రేమికుల మధ్య లేదు, తల్లి కుతుర్ల దగ్గర లేదు. ఇలా ఎక్కడ అయినా ఏ బంధంలో అయినా నీతి అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు.
ఇక పోతే ఉద్యోగుల్లో, రాజకీయ నాయకులలో నీతి అనేది అసలు కనిపించదు. అందరూ అవినీతి పరులేనా అంటే అందరూ కాదు. కొందరు ఉండడం వల్ల అందరికీ పేరు వస్తుంది.
అయితే అసలు నీతి అంటే ఏమిటి? నీతిగా ఎలా బతకాలి అనేది మీరు మీ రచన కథ, లేదా కవిత రూపంలో రాయండి. మీ అభిప్రాయం తెలుపండి.