ఈరోజు అంశం:- బాల్యం
బాల్యం అందమైన వరం బాల్యంలో చాలా ఆనందంగా ఉంటాం కానీ కొన్ని రోజులే. ఆ తర్వాత పెరుగుతూ ఉంటే బాల్యం బాధ్యతగా మారుతూ ఉంటుంది.
అందమైన ఆ బాల్యం మళ్లీ తిరిగి రావాలని చాలా మంది అనుకుంటారు. అప్పుడే బాగుంది ఇప్పుడు ఈ బాధ్యతల్లో మునిగి తేలుతూ చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నాం.
అలాంటి అందమైన బాల్యం తప్పి పోయింది. మట్టిలో ఆడుకునే రోజులు పోయాయి. దాగుడు మూతలు, చిర్రగొనే, కోతి కొమ్మచ్చి ఆటలు అటక ఎక్కాయి.
కొందరు వాటిని గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు బాల్యం లోకి వెళ్తుంటే, ఇంకా కొందరు సంపాదనలో పడి ఆ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకునే సమయం కూడా లేకుండా అయ్యారు.
ఇక బాల్యాన్ని ఆనందంగా గడిపిన వాళ్ళు కొందరే, ఇంకా కొందరు బాల్యంలో చాలా కష్టాలు పడుతూ కన్నీళ్ళ తో గడిపి దాన్ని గుర్తుకు తెచ్చుకునే ఇష్టాన్ని కూడా కలిగి ఉండరు.
అసలు బాల్యం అనేది చాలా మందికి గుర్తు కూడా ఉండదు. అయితే అన్ని బాధ్యతలు తిరిపోయాక మళ్లీ ఒక్క రోజు మీరు మీ బాల్యం లోకి వెళితే ఏం చేస్తారు?
ఏలా ఉంటారు? ఎలాంటి ఆటలు ఆడుకుంటారు? ఎలాంటి ఆహారాన్ని తింటారో మీ అందమైన రచన ద్వారా తెలియజేయండి.
బాల్యం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజేయండి.