ఈ సృష్టి లో అమ్మ ప్రేమ చాలా గొప్పది

ఈ సృష్టిలోఅమ్మప్రేమచాలాగొప్పది

 

తన పేరు రవి 10వరకు చదువుకున్నాడు…!
ఇప్పుడు తన వయస్సు 26 అతను ఏమ్ పని చెయ్యడు.. రోజు మందు తాగుతాడు, తనకి నాన్న లేడు అమ్మ అంటే ఇష్టం ఉండదు? ఎందుకంటే ఎవ్వరు ఏమ్ చెప్పిన వింటాడు, వాళ్ల అమ్మ మంచిది కాదు అని ఎవ్వరో చెప్తే తన అమ్మని దూరం పెట్టాడు, వాళ్ల అమ్మకి రవి అంటే ప్రాణం రవి వాళ్ల అమ్మ పేరు నాగ లక్షి
తన కొడుకు
హసహించుకుంటుంటే చానా బాధ పడేది.
రావికి ఒక రోజు మందు దుకాణంలో ఒక తాత పరిచయం అయ్యాడు.
వెళ్ళిన ప్రతి సూరి రవి
ఆ తాతతో చాలా బాగా మాట్లాడేవాడు,
ఒక రోజు తాత రవిని వాళ్ల ఇంటికి తీసుకెళ్ళాడు.

రవి: మీ ఇండ్లు చాలా బాగుంది.తాత

తాతయ్య: అవునా లోపలికి వెళ్దాం రా

రవి: తాతయ్య ఇవిడ ఫోటో ఏంటి ఎక్కడ ఉందేంటి

తాతయ్య: నా కూతురు బాబు నీకు తెలుసా

రవి:ఎక్కడో చూసినట్టు ఉంది.

తాతయ్య: ఎక్కడ చూశావు బాబు నా లక్ష్మి కోసం తిరగని చోటు అంటూ లేదు?

రవి: ఏమైంది.తాత ఎందుకు మీ అమ్మాయి మీకు దూరం అయింది.

తాతయ్య: మాకు పిల్లలు పుట్టలేదు?
5 సంవత్సరాల తర్వత ఆ నాగామ్మకు మొక్కుకున్నాం1సంవత్సరం తరువాత మాకు ఒక పాప పుట్టింది.
తనకి నాగ లక్ష్మి అని పేరు పెట్టాం .

నా లక్ష్మి పుట్టక నాకు బాగా కలిసి వచ్చింది.18సంవత్సరాల తర్వత ఎవ్వరినో ప్రేమించి మాకు చెప్తే మేము ఒప్పుకోము, అని లెటర్ రాసి పేట్టి ఇండ్లు వదిలి వెళ్ళిపోయింది.
3సంవత్సరాల తర్వత నాకు మనవడు పుట్టాడని వాళ్ళు ఉన్న చోటుకు వెళ్తే అక్కడ వాళ్ళు లేరు?మా అల్లుడు ఒక ప్రమాదంలో మరణించారని నా లక్ష్మి తన బిడ్డను తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయిందని తెలిసింది.

నా లక్ష్మికి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుకున్న… ఇప్పుడు నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో తలచుకుంటుంటే చానా బాధగా ఉంది.
నా లక్ష్మిని వెతుకుతూ ఈ ఊరు వచ్చాం /

రవి: అమ్మ నా కోసం ఎన్ని కష్టాలు పడిందా అని తాత నేను మల్లీ వస్తా.. అని బాధ పడుతూ అమ్మ దగ్గరకు వెళ్ళాడు,

లక్ష్మి: వంట చేస్తుంది.

రవి: వాళ్ల అమ్మ కాళ్ళు పట్టుకొని నిన్ను చానా బాధ పెట్టాను, కదా అమ్మ నన్ను క్షమించు అని అన్నాడు,

లక్ష్మి: ఏమైంది. నానా

రవి:అమ్మ ఎవ్వరో మట్లలు విని నిన్ను బాధ పెట్టాను, చానా కష్టపెట్టాను, కదా అమ్మ

లక్ష్మి: నువ్వు అమ్మ అని పిలిచినట్టు కలలు కనేదాన్ని ఎప్పుడు అమ్మ అని పిలిచావు? కదా అది చాలు నన్నా నా కొడుకు నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు, అని మురిసిపోయింది.

తర్వాత రోజు

రవి: కాఫీ షాప్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు,

తాతయ్య: ఎక్కడ ఏమ్ చేస్తున్నావ్… మనవడా

రవి: ఈ కొత్త పిలుపు ఏంటి తాత

తాతయ్య: నన్ను తాత అని పిలుస్తున్నావ్..! కదా నువ్వు నా మనవడివే కదా

రవి: అలాగ

తాతయ్య: హా ఏం ఆలోచిస్తున్నావు?

రవి: మా అమ్మ నా కోసం చానా కష్టపడుతోది.నేను ఏమన్నా పని చేదామనుకుంటే ఎవ్వరు నాకు పని ఇవ్వడం లేదు?

తాతయ్య: నువ్వు ఏం చదువుకున్నావు? మనవడా

రవి: పది వరకు చదువుకున్న.. తాత

తాతయ్య: ఐతే మన కాంపినీలో జాబ్ చెయ్యి

రవి: మీకు కంపిని ఉందా..! తాత

తాతయ్య: అవును మనవడా ఈ అడ్రస్ కి వెళ్లి నేను పంపమని చెప్పు

రవి: ఒకే తాత అమ్మమ్మ ఎక్కడ ఉన్నారు,

తాతయ్య: అమ్మమ్మ వాళ్ళ స్నేహతురాలి ఇంటికి వెళ్ళింది.

రవి: ఎప్పుడు వస్తుంది.

తాతయ్య: సాయంత్రం వస్తుంది.మనవడా

రవి:అవునా

తాతయ్య: హా మరి మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తావ్..!

రవి:అమ్మ పనికి వెళ్లింది తర్వాత తీసుకెళ్తాలే తాత

తాతయ్య: సరే

తర్వాత

రవి: ఇంటికి వెళ్ళాడు,

లక్ష్మి: ఏంటి నాన్న అంతా అనందంగా ఉన్నవ్..!

రవి: అమ్మ ఇలా కూర్చో నిన్న నీకు ఒక తాత గురించి చెప్పాను.. కదా!

లక్ష్మి: హా

రవి: ఆ తాత కంపినీలో నాకు జాబ్ ఇచ్చారు..నెలకి 30.000జీతం ఇంకా నువ్వు ఎక్కడ పని చెయ్యాల్సిన అవసరం లేదు?

లక్ష్మి: చాలా ఆనంద పడింది.

తర్వాత రోజు రవి తాత వాళ్ల ఇంటికి వెళ్ళాడు,

రవి: అమ్మమ్మ ఎలా ఉన్నారు,

అమ్మమ్మ: ఎవ్వరు బాబు నువ్వు

తాతయ్య: ఇక నుంచి తనే మన మనవడు

అమ్మమ్మ తాతయ్య రవితో ఉన్న కాసేపు చాలా ఆనందంగా ఉన్నారు,

ఒక నెల తర్వాత అమ్మమ్మ బాధ పడుతుంటే

రవి: అమ్మమ్మ ఎందుకు అలా ఉన్నవ్..!

అమ్మమ్మ: ఈ నెల 26 నా కూతురి పుట్టిన రోజు

రవి: చాలా ఆనందపడ్డడు అమ్మ పుట్టిన రోజుకు తాతయ్య అమ్మమ్మకి బహుమతిగా అమ్మను ఇవ్వాలి.అనుకున్నాడు, ఈ నెల 26రానే వచ్చింది.

రవి: వాళ్ల అమ్మకి పుట్టిన రోజు శుాకాంక్షలు అని చెప్పి చీర యిచ్చి కట్టుకొని రా మా

లక్ష్మి: ఇంత కరిదైన చీర నాకు ఎందుకు నాన్నా

రవి: నీ కంటే ఎక్కువ కాదులే మా నువ్వు ఈ చీర కట్టుకోని రాపో మా

తర్వాత లక్ష్మి ఆ చీర కట్టుకోని వచ్చింది.

రవి: ఈ చీర నీకు చాలా బాగుంది. పుట్టిన రోజు శుభాకంక్షలు మా
లక్ష్మి: ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఆనందంగా ఉండాలని దీవించింది.

రవి: అమ్మ నువ్వు నాతో ఉన్నవ్.. కదా! నేను ఎప్పుడు ఆనందంగా ఉంటా..!ఓకే మా నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా.. రా మా వెళ్దాం

లక్ష్మి: ఎక్కడికి

రవి: చెప్తా మా అని తాతయ్య వాళ్ల ఇంటికి తీసుకెళ్ళాడు,

తాతయ్య: రవి రా లోపలికి

రవి: తాతయ్య అమ్మమ్మ మీకు ఒక బహుమతి తీసుకొచ్చాను.

అమ్మమ్మ: ఏంటి అది నాన్నా

రవి: ఇన్ని రోజులుగా ఎవ్వరి కొసమైతే బాధ పడుతున్నారో ఎవ్వరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి బయటకు ఉన్నారు.

అమ్మమ్మ: బయటకు వెళ్లి చూస్తుంది.

లక్ష్మి: చూసి అమ్మ నాన్న అని ఏడుస్తుంది.

అమ్మమ్మ: ఈ అమ్మ నాన్న ఎప్పుడు గుర్తు వచ్చారా మా నీకు

లక్ష్మి: అమ్మ నాన్న నన్ను క్షమించండి.కాళ్ళ మీద పడింది.

తాతయ్య అమ్మమ్మ చానా సంతోషంగా ఉన్నారు,

లక్ష్మి: అమ్మ నాన్న మీ మనవడు రవి తాతయ్య

అమ్మమ్మ: రవి మా మనవడా అని చానా అనందపడ్డరు,
తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్ళారు..
రాత్రి పూట అందరూ మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేశారు.

రవి: అమ్మ నువ్వు ఆనందంగా ఉన్నావా..!

లక్ష్మి: చానా నాన్నా నాకు మా అమ్మ నాన్నలు చాలా ఇష్టం వాళ్ళను నాకు బహుమతిగా ఇచ్చావ్..!

రవి: అమ్మ ఒకటి అడనా

లక్ష్మి: అడుగు నాన్నా

రవి: నాన్నని ప్రేమిస్తున్నా.. అని చెప్పి ఉంటే అందరూ కలిసి ఉండేవారు, కదా!మా

లక్ష్మి: మా పెద్ద నాన్న కూతురు ముస్లిం అబ్బాయిని ప్రేమించిందని ఆ అబ్బాయిని మా పెద్ద నాన్న దారుణంగా నరికి చంపేశారు, మా అక్కని వురి వేసి చంపేశారు,
మా నాన్నని పోలీస్ లు అడిగితే మా నాన్న మా అన్న జేలుకు పోతే పగువు పోతుందని ఊరి వాళ్ళతో ఆ అమ్మాయి జబ్బుతో చనిపోయిందని చెప్పించారు, తర్వాత నన్ను మీ నాన్నని అలానే చంపేస్తారేమో అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఒక గుడిలో మీ నాన్న నేను పెళ్లి చేసుకున్నాం.

మీ నాన్నకి నేను తప్ప ఎవ్వరు లేరు?మీ నాన్న నన్ను మా అమ్మ మా అమ్మ నాన్నకి దూరం చేశానని చానా బాధ పడేవారు, నువ్వు నా కడుపున పడ్డాకా మేము చాలా ఆనందంగా ఉన్నాంనన్ను ఒక్క పని కూడా చేయ్యనిచ్చేవారు, కాదు? మీ నాన్నఅప్పుడప్పుడు అనిపించేది నేను నా పుట్టింట్లో యువ రాణినే ఎక్కడ యువ రాణినే నేను అన్న మాటలు
ఆ దేవుడికి అసూయగా అనిపించయేమో మీ నాన్నని తీసుకెళ్ళిపోయాడు.

నాకు ఇండ్లు తప్ప బయట ప్రపంచం తెలియదు? పని కోసం ఎక్కడికి వెళ్ళినా భర్త లేని ఆడదాన్ని ఏ ఉద్దేశంతో చూస్తారో తెలుసుగా నన్ను నేను కపాడుకోలి. నిన్ను పెంచి పెద్ద చెయ్యాలి. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నా… సమయంలో ఆ దేవుడిలా నాన్న స్నేహితుడు రాఘవ అన్నయ్య వచ్చి పని ఇప్పించాడు, నేను నీ కోసం చేయని పని అంటూ లేదు?

రవి: అమ్మమ్మ తాతయ్య వాళ్ల దగ్గరకు వెళ్ళలనిపించలేదా.. మా

లక్ష్మి: అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మని పట్టుకొని ఏడవలనిపించేది వీళ్ళు నన్ను ఆలా చూస్తే చానా బాధ పడతారు, ఆ బాధ ఏదో నేనే పడాలి. అనుకున్న..

రవి: సారీ మా అర్థం చేసుకోకుండా చానా బాధ పెట్టాను.కన్నీళ్లు పెట్టుకోని ఏడుస్తున్నారు.

లక్ష్మీ: ఎలా చూడు నాన్న ఏడవకు ఇప్పుడు ఈ అమ్మ అంటే ఇష్టమా

రవి: చానా

లక్ష్మి: ఇంకా ఎప్పుడు ఈ అమ్మ దూరం పెట్టకు రా మీ నాన్న చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉండేదాన్ని నీ కోసమే బ్రతుకుతున్న…

రవి:ఇంకా ఎప్పుడు నీ కంట కన్నీరు రానివ్వకుండా చూసుకుంటా.. ఇప్పుడు అందరూ కలిసి ఆనందంగా ఉన్నారు.

దిని బట్టి నేను చెప్పేది.ఏంటంటే ఎదుటి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకండి. సొంత వాళ్ళని దూరం పెట్టకండి. ప్రాణ స్నేహితులైయిన మోసం చెయ్యచ్చు. కానీ కన్న తల్లి తండ్రులు ఎప్పుడు మోసం చెయ్యారు..

 

-మంజులత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *