ఈ రేయి ఎవరిదో
నిదురరాని వారి రేయి
జాగారం వలె ఈశ్వరునికి
అంకితం!
నిదురలోకి జారి హాయిగా
నిదురించే వారి ఈ రేయి
స్వర్గసీమ !
బోసినవ్వుల పాపాయి
నిదుర పోకుంటే ఈ రేయి
అమ్మకి కలత నిద్రే !
పరువపు ప్రాయంలో వున్న
వాళ్లకు కంటిమీద కునుకు
ఉండనే ఉండదు ఈరేయి !
వలపు తలపుల ఊహల
పల్లకిలో ఊగే వారికి రేయి
పగలు నిరీక్షణే!
మనసువిప్పి మాటాడే
మనుషులకు తీయని స్వప్నం ఈ రేయి!
ప్రేమ పరిచయాల ఆస్వాదనకు ఊసులాడే చెలిమికి చెదరని నేస్తం
ఈ రేయి!
ఊహకందని ఆశలతో
సడి చప్పుడు కాకుండా
గడచిన రేయిమధురభావనే
ఈ రేయి!
అలసిన కనులకు సేదతీర్చే
ఆగని ఆలాపనల పల్లవులు
ఈ రేయి!
మత్తులో గమ్మత్తుగా విహరించే విందు చిందుల
విన్యాసాల ఆగడంకొందరికి ఈ రేయి !
గడచినకాలంలో జ్ఞానపకాలlనీడలోఇంకా
తెలవారదేమి ఈ రేయి !
మనసుకుప్రశాంతతనుఇచ్చే
ఈ రేయి రేపటి ఉదయం
కోసంఎదురుచూపు కావాలి!
– జి జయ