ఈ రాత్రి

ఈ రాత్రి

 

చుక్కలన్నీ నా చెంత చేరి నీ ఊసులు అడుగుతుంది
చిరుగాలి నా వెంట నడచి నీ తలపులని గుర్తుచేస్తుంది
చల్లని వెన్నెల నీ చెలికాడు ఎక్కడ అని ప్రశ్నిస్తుంది

ఎదురుచూసి చూసి అలసిన మనసు నీ జ్ఞాపకాలను
నెమరువేసుకుంటున్నాయి
నువ్వు నాతో ఉన్న ఆ వెన్నెల రాత్రుళ్ళు మనలో ఎంతకీ తీరని కోరికలు
నువ్వు నాపై కురిపించే ఆ ప్రేమలో ఎంతకీ తీరని ఆశలు
నువ్వు నన్ను హత్తుకున్న ఆ కౌగిలింతలో ఎంతకీ తీరని ముద్దులు
నువ్వు నాకై వెంటబడే ఆ దోబూచులాటలో ఎంతకీ తీరని మలుపులు
నువ్వు నాలో పెంచే గుండె దడలో ఎంతకీ తీరని మది సవ్వడులు

ఈ వెన్నెల రాత్రి ఇలా వెలవెల బోతోంది
నీ జాడలేక
నీ ప్రేమలేక
నీ స్పర్శలేక
ఇలా నేను నా మైకంలో నీ పేరునే కలవరించి స్వప్నంలోనే
నిదురించాను

– హిమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *