ఏం మాయ చేశావే ఎపిసోడ్ 1
అమృతా….అమ్మ… అమృతా…
ఏంటి అమ్మ…
పైన సజ్జే మీద మీ పాత పుస్తకాలు ఉన్నాయి కదా…అందులో మీకు పనికి వచ్చేవి ఎం అయిన
వున్నాయ..
ఏమో అమ్మ…
ఒకసారి వెళ్లి చూసి పనికి రానివి కింద తెచ్చి పెట్టు …పాత సామాన్ల వాడి కి వేసేస్తా..ఇంట్లో కాస్త స్థలం అయిన వుంటుంది…
సరే అమ్మా అని…చిన్న స్టూల్ సహాయం తో ఎక్కి సర్దుతుంది…పనికి రానివి అన్ని కింద పెడుతూ పనికి వచ్చేవి అక్కడే పైన ఒక మూలన పెడుతుంది…అన్ని ఓపెన్ చేసి పేజీలు తిప్పి పెడుతుంది ఎందుకు అంటే..తనకు పుస్తకాల్లో డబ్బులు దాచే అలవాటు వుంది..అన్ని సర్దుతూ వుండగా కొన్ని పుస్తకాల్లో డబ్బులు కూడా దొరికాయి కానీ అవి కొన్ని ఇప్పుడు చెల్లని నోట్లు 500 నోట్లు..కూడా వున్నాయి..అవి చూశాక కాస్త బాధ పడిన…ఒక చిన్న ఆనందం కూడా వుంది…పేజీలు తిప్పితే అందులో ఒక చోట గులాబీ పువ్వు దొరికింది..అది ఎండిపోయి కాస్త నిలి రంగు లో మారి ఎండి పోయి వుంది…దాన్ని చూసిన అమృతా కి గత జ్ఞాపకం గుర్తు వచ్చింది….
.సాగర్….కింద పడుతావు రా అని అరుస్తున్న పట్టించుకోకుండా సాగర్ జలపాతం దగ్గర వున్న గులాబీ కోసం పాట్లు పడుతున్నాడు…
అయ్యో సాగర్…వదిలేయ్…మా ఇంటి ముందూ పెద్ద తోట వుంది… ఎదో బాగుంది అని అన్నందుకు ..ఎందుకు ఇంత కష్ట పడుతున్నావు…
అవి ఎం పట్టించుకోకుండా తన పని లో నిమగ్నం అయ్యాడు…అలుపు ఎరగని విక్రమార్కుడి ల సాధించే అంత వరకు వదలలేదు…అమృతా నువ్వు అడిగిన పువ్వు అని తెచ్చి తన ముందు అందించాడు…మోకాళ్లపై వంగి…
సాగర్ ఎంటి ఇది…
అవును అమృతా నేను నిన్ను ప్రేమిస్తున్నాను…నికు నచ్చితే పెళ్లి కూడా చేసుకుంటా…
వారి ఇద్దరి మధ్య మంచి స్నేహం వుంది …దాన్ని తెలివిమంతుడు అయిన సాగర్ ఇలా అర్థం చేసుకోవడం అమృతా కి బాధ వేసింది…
చూడు సాగర్…మన మధ్య మంచి స్నేహం వుంది….దాన్ని పాడు చెయ్యడం నాకు ఇష్టం లేదు…నువ్వు అంటే నాకు ఇష్టం వుంది కానీ అది ప్రేమ కాదు…నన్ను అర్ధం చేసుకుంటారు అని అనుకుంటున్న…
పర్లేదు అమృతా …నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని అనుకున్న చెప్పేశా…నీ ఇష్టం నేను కాదు అనను…నిజం గా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే…నిన్ను నీ ఇష్టం ని కూడా ప్రేమించాలి కదా….నేను ఆర్య సినిమా లో అల్లుఅర్జున్ టైపు…అని నవ్వేసి…. పదా ఫోటో లు తియ్యాలి నేను ఇంకా…ఫ్రి ఫోటగ్రాఫర్ అని సీనియర్ అయిన నన్ను మీ బ్యాచ్ పికినిక్ కి పట్టుకచ్చరు…తీయకపోతే మేడం వాళ్ళు ఫీల్ అవుతారు…పదా పదా అని క్యమరా మళ్లీ మెడలో వేసుకొని చిరునవ్వు నవ్వుతూ కదిలాడు సాగర్… ఆ సాగరం ల…
అమ్మ అమృతా…అయిపోయిందా….పుస్తకాలు తీసుకురా..అని అమ్మ పిలుపు విని..
వస్తున్న అమ్మ అంటూ …గులాబీ పక్కన పెట్టి పుస్తకాలు తీసుకొని వెళ్ళింది…అమృతా…
-భరద్వాజ్