ఈకాలంలో నాన్న
నాన్నంటే..ఆడపిల్ల అంటే చిదరించుకునేవాడు
నాన్నంటే ఆడపిల్లను దరిద్రంగా భావించేవాడు
నాన్నంటే అడదంటే చులకనగా చూసేవాడు
నాన్నంటే. ఆడదానికి చదువు ఎందుకు అనుకునేవాడు
నాన్నంటే. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునేవాడు
నాన్నంటే ఆడపిల్ల నీ బరువుగా భావించేవాడు
నాన్నంటే.ఆడపిల్ల నీ ఇంట్లోంచి బయటకు పంపనివాడు
నాన్నంటే. ఆడపిల్లకు తిండి దండగ అనుకునేవాడు
నాన్నంటే. ఆడపిల్లను తొందరగా వదిలించు కోవాలి అనుకునేవాడు
నాన్నంటే. ఆడపిల్లకు హక్కులు లేవనే వాడు
నాన్నంటే. ఆడపిల్లను ఎవడికో ఒకడికి కట్టబెట్టి చేతులు దులుపుకునే వాడు
నాన్నంటే. ఆడపిల్ల తన కష్టం చెప్పినా పట్టించుకోనివాడు
నాన్నంటే.ఆడపిల్లని సారాయి దుకాణానికి పంపేవాడు
నాన్నంటే. ఆడపిల్లని అయ్య చేతిలో పెట్టినా
వాడు బాధలు పెడుతున్నాడు అంటే నమ్మనివాడు
నాన్నంటే. ఆడపిల్లను భర్త చంపినా మొగుడి చేతిలో చచ్చింది పరవాలేదు అనేవాడు
నాన్నంటే. ఆడపిల్లను అవసరమైతే తాకట్టు పెట్టేవాడు
#నాన్న అంటే ఆడపిల్ల గా పుట్టడం శాపం అని అనిపించేలా చేసేవాడు
#నాన్న అంటే ఆడపిల్ల అని తెలిసి బూతులు తిట్టే వాడు
#నాన్న అంటే ఆడపిల్ల అని తెలిసి కామం తో కళ్ళు మూసుకు పోయి కాటేసేవాడు.
#నాన్న అంటే ఆడపిల్లకు ఈ కాలం లో నరరూప రాక్షసుడు అనేవాడు ..
#, నాన్నంటే ఈ కాలం లో ఆడపిల్లకు మృగం లాంటి వాడు.
( ఇది కొందరికి నచ్చక పోయినా నిజం ఇదే, అప్పుడప్పుడు నిజాలు కూడా చెప్పాలి, జరుగుతున్న ఘోరాలు ఇలాగే ఉన్నాయి.)
-భవ్యచారు