ఈ గుండె నీది కాదు నాది

ఈ గుండె నీది కాదు నాది

                           

సహస్ర , వైష్ణవ్ లకు కొత్త పెళ్లయింది. సహస్ర వాళ్ళు విజయవాడలో ఉండడం వల్ల అక్కడే వీళ్ళు పెళ్లి జరిగింది. వైష్ణవ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి వచ్చారు.

అలా రోజులు గడుస్తున్న కొద్ది వీళ్ళ మధ్యన ప్రేమ పెరిగింది.వాళ్ల కాలనీలో జరిగే ఒక ఫంక్షన్ కి వీళ్ళిద్దరూ వెళ్తే వీళ్ళ జంటని చూసి అన్యోన్యతమైన జంట.ఎవరి దిష్టి తగలకూడదు అని అనుకున్నారు.

అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు వైష్ణవ్ తన ఫ్రెండ్ చాలా ఏళ్ల తర్వాత కలిశారు.దూరంగా ఉన్న  సహస్రని చూసి తన ప్రేమ విషయం గురించి చెప్పాడు.

ఆ విషయం విని వైష్ణవ్  తన ఫ్రెండ్ అన్న మాటలకి తనలో అనుమానం పెరిగింది. కానీ సహస్ర తన భార్య అని మాత్రం చెప్పలేదు వైష్ణవ్.

మరుసటి రోజు ఉదయం వైష్ణవ్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత సహస్ర ఎవరితో ఫోన్ మాట్లాడడం అది గమనించిన వైష్ణవ్ తనలో ఇంకా అనుమానం పెరిగింది.ఆరోజు రాత్రి బాగా తాగేసి వచ్చాడు వైష్ణవ్.

ఆ తాగిన మత్తులో జరిగిన తనకి తన ఫ్రెండ్ కి జరిగిన విషయం మొత్తం సహస్రకి చెప్పేసాడు.
అది విని సహస్ర ఆశ్చర్యానికి లోనైంది.

వెంటనే ఒక ఉత్తరం రాయడం మొదలు పెట్టింది సహస్ర.

నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం. నేను ప్రేమించిన వ్యక్తి ఒక ప్రమాదంలో చనిపోయాడు. అదే ప్రమాదంలో మీ తల్లిదండ్రుల కూడా కోల్పోయారని నాకు పెళ్లి చూపుల్లో మీరు చెప్పారు. అందుకే మీకు ఆ రోజు ఆ ప్రమాదం గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను , మీకు గుర్తుందా? నా ప్రేమ విషయం మీకు చెప్పకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది.

అది ఏంటంటే నేను ప్రేమించిన వ్యక్తి చనిపోకముందు తన అవయవాలను దానం చేశాడు.  నేను ప్రేమించిన వ్యక్తి గుండె మీకు పెట్టడం వల్ల మీరు బ్రతికారు.

కానీ మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తనలాగే నన్ను ప్రేమించారు. నన్ను ప్రేమించిన వ్యక్తిని మీలో చూసుకుంటూ నీతో జీవితం గడపడానికి నిర్ణయించుకున్నాను.

మీకు గుండె ఎవరిచ్చారు అని డాక్టర్ని మీరు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పకపోవడానికి కారణం నేను.

మొన్న కూడా నాకు డాక్టర్ ఫోన్ చేసి మీ హెల్త్ కండిషన్ కొంచెం సీరియస్ గా ఉంది అని చెప్పారు.
మీకు ఎలాంటి ఒత్తిడి,టెన్షన్స్ లేకుండా చూసుకోవాలని చెప్పారు.

మీరు ఆఫీస్ కి వెళ్ళిన ఆరోజు ఉదయం నేను డాక్టర్ తోనే మాట్లాడాను అని కన్నీళ్లు తుడుచుకుంటుంది సహస్ర.మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని సహస్ర బాధపడింది.
                           

ఇలా రాసి ఆ పేపరు టీవీ దగ్గర ఉన్న గూటిలోని గువ్వలు ఉన్న బొమ్మ కింద పెట్టింది సహస్ర.
ఉదయం వైష్ణవ్ నిద్ర లేచినప్పటికి తల భారంగా అనిపించి ,

“సహస్ర… ఎక్కడ ఉన్నావ్? సహస్ర…” అని పిలుస్తూ ఇల్లు మొత్తం వెతికాడు వైష్ణవ్.అయినా సరే ఎక్కడ కనిపించలేదు సహస్ర. సోఫాలో కూర్చుండగా టీవీ దగ్గర ఉన్న పేపర్ కనిపించింది.

ఆ పేపర్ తీసుకొని చదవగా తను చేసిన తప్పు తెలుసుకున్నాడు వైష్ణవ్.సహస్ర వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి , యోగక్షేమాలు అన్నీ తెలుసుకున్న తర్వాత

“రాఖీ పండుగ వస్తుంది కదా. చక్రి వస్తున్నాడు ఈ విషయం సహస్రకు చెప్పకు. సహస్ర లేదా ఎక్కడికి వెళ్ళింది?” అని అడిగారు.

“లేదు… మావయ్య గారు తను గుడికి వెళ్ళింది” అని అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేసాడు వైష్ణవ్.
సహస్ర కోసం బయటికి వచ్చిన వైష్ణవ్ కి ఎదురుగా పక్కింటి పిన్ని గారితో కలిసి రావడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు.

రెండు రోజులు వరకు వైష్ణవ్ తో మాట్లాడలేదు సహస్ర. అప్పుడు టీవీ దగ్గర ఉన్న గూటిలోని గువ్వలు బొమ్మని చూసి గతంలోకి వెళ్ళాడు వైష్ణవ్.

ఆరోజు తన పుట్టినరోజు,
“మనిద్దరం ఎప్పుడు కలిసి ఉండాలని మీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి  గూటిలోని గువ్వలు అనే బొమ్మ ఇచ్చింది సహస్ర.”

“ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఆ బొమ్మని చూసిన వైష్ణవ్ మనిద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం” అని చెప్పాడు.

ఈ గుండె నీది కాదు నాది. నీ గుండెల్లో స్థానం మాత్రం నాదే అని చెప్పింది సహస్ర.ఇలా భార్యాభర్తలే కాదు అప్పుడప్పుడు గూటిలోని గువ్వలు కూడా గొడవ పడుతాయి.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *