ఎదురు చూపు
వాన… ఓ… వాన
నీ మీద నాకు ప్రేమ
నీ రాక కోసం నా ఎదురు చూపు
కొండ , కొన మురిపించింది..
నదులు , కాల్వలు పొంగుతూ
ఆగకుండా పడుతుంది ఈ వాన
ఎప్పటికి ఈ వాన ఆగిపోతుంది అని ఎదురు చూస్తూ ఉన్నా
ఒకప్పుడు వాన రావాలని కోరుతూ
ఎన్నో పూజలు చేస్తూ
పంటలు బాగా పండాలని రైతులు కోరుతూ
వానలో తడుస్తూ ఆటలు ఆడుతుంటే
నా మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది..
ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ
వాన చినుకులతో ఆడుతూ ఉంటే
ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏమైనా తింటే
ప్రజలు సూర్యుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ
వాన…. ఓ… ఆగిపోని వాన
ప్రజలు ఇంకెన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి..
ఇంకా వాన పడుతుంటే విసుగుగా అనిపిస్తుంది…
వాన… ఓ… వాన
ఇంకా ఎన్ని రోజులు ఈ చల్లగాలులను అనుభవించాలి…
ఇంకెప్పుడు సూర్యుడు వస్తాడు
ఆయన కోసమే నా ఎదురు చూపు…
-మాధవి కాళ్ల