ఎదురీత
ఏటికి ఎదురు ఈదగలమా అని ఒక శాస్త్రం వుంది.
కానీ ఎన్నిటికైనా ఎదురొడ్డి నిలిచిన వారే విజేతలుగా నిలబడతారు. అని అన్నింట్లా ఋజువవతూ ఉంటుంది. ఉదాహరణకు
ప్రపంచ బాక్సింగ్ క్రీడాకారిణి (నిఖత్ జరీన) పట్టుదల
ఆమె ఎంచుకున్న రంగం ఎదురీత విజయం అని చెప్పొచ్చు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా బాక్సింగ్ క్రీడాకారిణి కావడం మనం అందరం అభినందించాల్సివిషయం.
చిన్నతనం నుండి క్రీడలలో
ఆసక్తి వున్నా వారి మత, సాంప్రదాయాలను సమాజపరంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నా,
నీఖత్ జరీన పట్టుదల ముందు అవేవి సమస్యలు కావు అని నిరూపించిన దైర్యమున్న క్రీడాకారిణి.
దానికి తోడు కుటుంబ సహాయ సహకారాలు, వారు
ఆమెను ప్రోత్సహించిన విధానము.
తెలంగాణ రాష్ట్ర తోడ్పాటు ఈరోజు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఖ్యాతిని ఆమె తెచ్చిపెట్టింది.
(కష్టం, క్రమశిక్షణ, దైర్యం, ఆత్మ విశ్వాసం) కొన్నిసార్లు
ఓడినప్పుడు గమ్యాన్ని లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేసి పోటీ
వున్నా సాధించి నిలిచింది.
(ధైర్యే సాహసే లక్ష్మీ) అంటారు పెద్దలు. గెలుపు కోసం అలుపు లేకుండా
ఆటలో రాణించి క్రీడాకారుల
అందరికిఆదర్శంగా నిలిచింది “నిఖత్ జరీన్”
తెలంగాణ ముద్దు బిడ్డగా
గర్వించవలసిన సందర్భం..
– జి జయ