ఎద గాయాలు

ఎద గాయాలు

ఎదకు తగిలిన గాయం..
గుండెను పిండి చేస్తుంది..
పైకి కనపడని గాయం చేసే..
ఆవేదన భరించ లేనిది..

శరీరం పైన అయ్యే గాయానికి..
మందు పూయచ్చు..
కొంత కాలానికి గాయం తగ్గచ్చు..
కానీ…
హృదయానికి గాయం తగిలితే..

ఏ మందులూ పని చేయవు..
ఎన్ని లక్షలు ఖర్చయినా..
ఆ గాయం మానదు…
జీవితాంతం అలాగే ఉండి పోతుంది…

అందుకే…
ఎవరితో మాట్లాడినా..
ఆచి తూచి మాట్లాడు..
వెనుకా ముందు ఆలోచించు..
నీ మాటలే గాయం చేయవచ్చు…

నీ మాటలే సంబర పెట్టవచ్చు..
మా టల్లో అంత మహత్యం ఉంటుంది. .
ముల్లులా గుచ్చేవి మాటలే..
శాంతంగా చెప్పేవి మాటలే!!

నొప్పింపక తానొవ్వక..
తప్పించుకు తిరుగువాడే..
ధన్యుడు సుమతీ!!
అన్నారు మన పెద్దవాళ్లు..

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *