దూరం ఎప్పుడూ దగ్గరే..
నీ గురించి రాద్దాం అనుకున్నపుడల్లా ఎమ్ రాయాలి నీ గురించి అని ఒకే ఆలోచన….
నువ్వు నాలానే అంతర్ముఖురాలివి…
బయట ఒకలా లోపల ఇంకోల నటించడం రాని పిచ్చిదానివి అని చెప్పాలనిఉండేది….
కానీ ఒకటి మాత్రం కచ్చితం గా చెప్పాలి నీ గురించి
బాధల్ని బరిస్తూ బాధ్యతల నుండి తప్పుకునే దానివి కావు…
తెలియని వాడు బాధలో ఉన్న…
నీ సొంత మనిషికి చెప్పినట్టే మంచి చెప్తావ్…
నిరాశ నిండిన కళ్ళలో ఆశల దారులు తప్పకుండా చూపిస్తావ్….
నీ కళ్ల లోపల ఎన్ని సుడిగుండాలు గిరి గీసుకొని కూచున్న…కన్నీటి చుక్క బయటకు రాకుండా, నవ్వుతూ బతకడం బహుశా నీకు ఆ దేవుడిచ్చిన వరం…
నీ కలల సాధన కోసం కష్టాలను,కన్నీళ్లను కడ వరకు మోస్తూ…నీ విజయ మార్గానికి సజీవ సాక్షాలుగ మార్వడం నీకే చెల్లుతుంది..
నాకు ఇప్పటికి అర్థం కాదు ఎలా నువ్వు వర్క్ చేస్తూ,కథలు రాస్తూ జీవితాన్ని ఇలా లీడ్ చేస్తావో….
ఎన్ని కష్టాలు న్న పంటి దిగువన బరిస్తూ బలమైన ఆశయం కోసం ముందుకు పోయే నిన్ను చూస్తే నేనెందుకు నీలా ఉండలేనో అని ఎన్నో సార్లు అనుకున్న…
కానీ నీ లాంటి ఒక అమ్మాయి నన్ను మంచి స్నేహితుడిగా చూస్తుంది అంటే నాకు నేనే కొంచెం నమ్మలేకపోతున్న…
నీలో ఏదో ఉంది…
ఒకర్ని మంచిగా చూసే నీ లో నేను అమ్మని చూసిన..
ఎప్పుడు ఎవ్వరిని బాధ పెట్టని నీలో ఒక అక్కని చూసిన…
నా కోసం అప్పుడప్పుడు కేర్ తీసుకుంటే ఒక హితురాలిని చూసిన…
అందుకే చెప్తున్న నేస్తమా…
కల చెదిరిన కాలం నిన్ను బయపెట్టిన…
నువ్వు నడిచే బాట నిన్ను బాధ పెట్టిన..
నువ్వు పీల్చే శ్వాస నీకు ప్రశాంతత ఇయ్యకపోయిన…
గాలి సైతం నిన్ను గందర గోలానికి గురిచేసిన…
ఉంటా నీకు కాపలాగా
ఆ కాలాన్ని కంగారు పెట్టడానికి..
బాటను భయపెట్టడానికి…
మా ఉంటా నీకు తోడుగా
నీ అంతట నువ్వు దూరం అయ్యేవరకు…
మా ఉంట నీ నీడగా
నా నీడను నువ్వు పొమ్మనేదాక…
మా ఉంట నీతో
నా వల్ల నువ్వు ఇబ్బంది పడనంత వరకు…
మా ఒక వేళ దూరమైన
మన మనసుల దూరం ఎప్పుడూ దగ్గరే….
-ప్రవీణ్
రచన బాగుంది.