ద్రోహి
గణపతి , చక్రధర్ మంచి స్నేహితులు. ఓకే కాలనీలో ఇరుగు పొరుగు ఉన్నారు. ఓకే కాలనీలో ఉండడం వల్ల వీళ్లు మంచి స్నేహితులు అయ్యారు. గణపతి ఒక కంపెనీలో ఒక మేనేజర్ గా చేస్తున్నాడు. చక్రధర్ తన బావ అయిన లోకేష్ కలిసి ప్లాట్ బిజినెస్ చేస్తున్నారు.
గణపతికి ఒక కొడుకు ఉన్నాడు. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు. చక్రధర్ కి కొడుకు , కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లిసంబంధాలు చూస్తున్నారు.
కొన్ని రోజులు తరువాత గణపతికి వేరే ఊరు బదిలీ అయ్యింది. ఇల్లు సొంతం కావడం వల్ల గణపతి అమ్మలని అనుకున్నాడు. ఈ విషయం చక్రధర్ కి చెప్పాడు గణపతి.
మీ ఇల్లు కి మంచి రేటు పలుకుంది అని చెప్పాడు చక్రధర్.ఈ విషయం లోకేష్ కి చెప్పితే గణపతి వాళ్ళ ఇల్లు చూసి ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నేనే ఈ ఇల్లు కొనుక్కుంటాను అని చెప్పాడు.
గణపతి చెప్పిన రేటుకే ఇల్లు లోకేష్ కొనుక్కున్నాడు. “తను వేరే ఊరు బదిలీ అవుతున్నా సందర్భంగా ఈ ఆదివారం మీ అందరూ భోజనానికి రావాలి” అని చెప్పాడు గణపతి.
“గిరిజ అన్ని రెడీ నా వాళ్ళు వచ్చే టైం అయ్యింది” అని చెప్పాడు గణపతి.“అన్ని రెడీ అండి. మీరు కంగారు పడకండి” అని చెప్పింది గిరిజ.
ఆరోజు ముగ్గురు కుటుంబాలు కలిసి ఎంతో బాగా కబుర్లు భోజనాలు చేశారు.ఇలా అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్లకి చక్రధర్ , గణపతి కి ఫోన్ చేశాడు.యోగక్షేమాలు అన్నీ కొనుక్కొని ఏదో చెబుదామని ఫోన్ చేసిన వాడు చెప్పకుండానే ఫోన్ పెట్టేసాడు చక్రధర్.
అదే కాలనీలో ఉండే నీరజ్ ఒక రోజు చక్రధర్ ని కలిసి“ఏంటి చక్రధర్ గారు మీ ఫ్రెండ్ లేడని దిగులుగా ఉన్నారా?” అని అడిగాడు నీరజ్.“ఏం లేదండి కొంచెం వర్క్ టెన్షన్ అంతే” అని చెప్పాడు చక్రధర్.
“ఈ కాలనీ కి కొత్తగా వచ్చినప్పుడు నుండి నువ్వు గణపతి గారు అప్పటినుంచి మీరు మంచి స్నేహితులు ఇక ఎన్నాళ్లు స్నేహితులుగా ఉంటారు. మీ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. మీ ఇద్దరి మధ్య మరో బంధుత్వం కూడా ఏర్పడుతుంది” అని చెప్పాడు నీరజ్.
‘నీరజ్ చెప్పింది కూడా ఏదో మంచిగానే ఉంది. ఒక్కసారి గణపతికి ఫోన్ చేసి అడిగితే ఏమంటాడో అని తన మనసులో అనుకున్నాడు చక్రధర్.’
“ఇంకా మేము ఏమి అనుకోలేదు నీరజ్” అని చెప్పాడు చక్రధర్.
“మీ బావ పద్ధతి అసలేం బాలేదు. రాజేష్ గారు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు కదా. ఆ ఇల్లు కూడా మీద లోకేష్ గారే కొన్నారు కదా. ఆ ఇంటి పేరు మీద లోన్ తీసుకున్నారంట అయితే ఇప్పుడు రాజేష్ కి ఫోన్ చేసి లోన్ కట్టమని అడుగుతున్నారు అంట బ్యాంకు వాళ్ళు “అని చెప్పాడు నీరజ్.
“ఇంత జరిగిందా? మరి మీరు నాకెందుకు చెప్పలేదు?” అని అడిగారు చక్రధర్ కోపంగా.
“ఈ విషయం నేను వెళ్లి లోకేష్ గారిని అడిగితే మీకు చెప్తాను అంటే ఈ విషయం మీకు ముందే తెలుసు అని చెప్పాడు మాకు” అని చెప్పాడు నీరజ్.
“ఏవండీ… ఒక సారి అండి మీతో మాట్లాడాలి” అని పిలిచింది భవాని.“సరే నేను మీతో తర్వాత మాట్లాడతాను” అని నీరజ్ కి చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు చక్రధర్.“అబ్బా… ఏంటి పిలిచావు చెప్పు?” అని అడిగాడు చక్రధర్.
“గణపతి అన్నయ్య గారి ఇల్లు లోకేష్ కొనుక్కున్నాడు కదండీ.
ఆ ఇంటి మీద లోన్ తీసుకున్నడంట ఆ లోన్ కట్టమని గణపతి అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పారంట లేదంటే వాళ్ల మీద కేసు వేస్తానని బెదిరిస్తున్నారు అంట” అని చెప్పింది భవాని.
“ఈ విషయం నీకు ఎలా తెలుసు?” అని అడిగారు చక్రధర్.“గిరిజ కి ఫోన్ చేస్తే ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి ఈ విషయం నాకు చెప్పాడండి. ఈ విషయం అన్నయ్యకి వదినకి ఇంకా తెలియదు అంట” అని చెప్పింది భవాని.
“ఈ సమస్య ఇక్కడితోనే సాల్వ్ అయ్యేటట్లు చేస్తాను” అని చెప్పాడు చక్రధర్.“మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ వివాదాస్పదమైన స్నేహం గా మారకుండా చూసుకోండి. మీరు వెంటనే లోకేష్ మీద పోలీస్ కంప్లైంట్ చేయండి” అని చెప్పింది భవాని.
“నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ తో మాట్లాడి కంప్లైంట్ చేస్తా” అని చెప్పాడు చక్రధర్.
రెండు రోజుల తర్వాత గణపతి తన ఫ్యామిలీతో చక్రధర్ ని చూడడానికి వచ్చారు.
“ఏంట్రా సడన్ గా వచ్చారు” అని అడిగాడు చక్రధర్.“మీతో ఒక వారం రోజులు గడిపి వెళ్లిపోదామని అనుకున్నాను. అందుకని వచ్చాము రా” అని చెప్పాడు గణపతి.
రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత భవాని ,గిరిజ కిచెన్ లో మాట్లాడుకుంటున్నారు.
“ఏంటి వదిన శిరీషకి సంబంధాలు ఏమైనా వచ్చాయా?” అని అడిగింది గిరిజ.
“లేదు వదిన… అందరూ ఎక్కువ కట్నం అడుగుతున్నారు. మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు లోకేష్ . వాడి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము” దిగులుగా చెప్పింది భవాని.
అవునా ఇంత చదివితే మాకెందుకు చెప్పలేదు వదిన అని అడిగింది గిరిజ.
“అసలే అన్నయ్యగారు హార్ట్ పేషెంట్. ఈ విషయాలు చెప్తే ఇంకా కంగారు పడిపోతారు అందుకే చెప్పలేదు”అని చెప్పింది భవాని.
“మీ శిరీషని మా ఇంటి కోడలిగా పంపిస్తావా వదిన?” అని అడిగింది మనసులో మాట గిరిజ.కొంచెం ఆశ్చర్యంగా “నిజమా… వదిన” అని అడిగింది భవాని.
“అవును వదిన నాకు ఎలాగో కూతురు లేరు. వచ్చిన కోడల్ని కూతుర్ల చూసుకుందాం అనుకుంటున్నాను” అని చెప్పింది గిరిజ.
“నాకైతే ఇష్టమే అన్నయ్య ఒకసారి మీ అన్నయ్యని అడిగితే ఇంకా బాగుంటుంది. శిరీష ఇష్టమో లేదో తెలుసుకోవాలి కదా” అని ఆనందంగా చెప్పింది భవాని.
మరుసటి రోజు ఉదయం శిరీష , ఆదిత్య లను పిలిచి ఒకేసారి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాము. మీ ఇద్దరికీ ఇష్టమైన అని అడిగాడు చక్రధర్.వాళ్ళిద్దరూ కాసేపు ఆలోచించి“నాకు ఇష్టమే నాన్న” అని చెప్పింది శిరీష.” మీ ఇష్టమే నా ఇష్టం నాన్న” అని చెప్పాడు ఆదిత్య.
పంతులు గాని పిలిచి నిశ్చితార్థం కి ముహూర్తం పెట్టించారు.రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉంది అని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.లోకేష్ వీళ్ళు స్నేహం చూసి అసూయతో కావాలని చక్రధర్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు.
కావాలనే రెండు ఇల్లు కొనుక్కొని వాటి మీద లోన్ తీసుకొని చక్రధర్ ని ఇరికించాడు.నిశ్చితార్థం జరుగుతున్న రోజు ఇంటికి పోలీసులు వచ్చారు.“చక్రధర్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం” అని చెప్పారు పోలీసులు.
“నేనేం తప్పు చేశాను సార్. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు” అని అని ఆశ్చర్యంగా అడిగాడు చక్రధర్.
బ్యాంకులో లోకేష్ లోన్ తీసుకున్నప్పుడు మీరు షూరిటీ పేపర్ మీద సైన్ చేసినట్టు బ్యాంకు వాళ్ళు చూపిస్తున్నారు అని చెప్పాడు పోలీస్.
“నేను ఏ పేపర్ల మీద సైన్ చేయలేదు” అని చెప్పాడు చక్రధర్.
మా ఎంక్వయిరీలు మేము చేయాలి కదా. మిమ్మల్ని అరెస్టు చేస్తున్న అని పోలీసులు తీసుకెళ్లిపోయారు చక్రధర్ ని.
ఆదిత్య ఫ్రెండ్ సిబి ఆఫీసర్ కాబట్టి ఈ కేసుని సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తున్నాడు.
వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకేష్ తన భార్య మారువేషంలో వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతున్నారని తెలుసుకొని ఆదిత్య కి చెప్పాడు.
భవాని ఏడుస్తూ అన్నయ్య ఆయన ఏం తప్పు చేయలేదు అన్నయ్య అసలు తప్పే లేదు అని చెప్పింది.
నా స్నేహితుడి మీద నాకు నమ్మకం లేకపోతే ఎలా చెప్పమ్మా . వాడు ఈ తప్పు చేయలేదు. ఎవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. వాడు త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తాడు అని చెప్పాడు గణపతి.
ఆదిత్య లోకేష్ తన భార్య ఏం మారువేషంలో ఉన్నారో అని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
అందరూ కోర్టుకు బయలుదేరుతుండగా ముష్టివాడు వచ్చి అన్నం పెట్టండమ్మా ఆకలేస్తుంది అని అన్నాడు.
“మీ అందరి వెళ్ళండి నేను వెనకలే వస్తాను” అని చెప్పింది శిరీష.“నేను తనకు తోడుగా ఉంటాను నాన్న మీరు వెళ్ళండి” అని చెప్పాడు ఆదిత్య.ఆ ముష్టి వాడికి ఆమెతోపాటు ఒక పెద్దావిడ ఉంది ఆవిడకి అన్నం పెడుతుంది శిరీష.
అయితే అన్నం తింటుండగా ఆ ముష్టి వాడి గడ్డం కొంచం ఊడిపోతుంది.
అది గమనించిన ఆదిత్య ముష్టివాడు కాదు ఆ వేషంలో ఉన్న లోకేష్ తన భార్య అని అర్థం చేసుకున్నాడు.
వాళ్లు తిన్న తర్వాత నాకు తెలుసు నాకు అనాధాశ్రమంలో మిమ్మల్ని జాయిన్ చేయిస్తాను నాతో పాటు రండి అనుకొని ఆదిత్య చెప్పాడు.
ఆదిత్య ప్లాన్ తెలియని లోకేష్ ఒప్పుకున్నారు.కారు కోర్టు దగ్గర ఆగేసరికి కొంచెం కంగారుగా అదేంటి సారు ఇక్కడ ఆపారు అని అడిగాడు నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది నువ్వు లోకేష్ నీ పక్కన ఉండి నీ భార్య హేమ అంతే కదా అని చెప్పాడు ఆదిత్య.
ఆ మాటకి షాక్ అయ్యి పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పట్టుకోవడం వల్ల లోకేష్ ని తన భార్యని తీసుకొని వెళ్ళి నిజం చెప్పించారు.
ఈ ద్రోహిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను అని చక్రధర్ చెప్పాడు.
లోకేష్ లాంటోళ్లు చాలామంది ఉంటారు. సొంత వాళ్ళయినా అనుకోకూడదు. కానీ పరాయిపాలైన. సరే ఇలా చేస్తారు అని నమ్మడానికి వీలు లేకుండా చేస్తారు. వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. ఇలాంటి ద్రోహులు చాలామంది ఉంటారు. మనం జాగ్రత్తగా ఉంటే అదే చాలు.
-మాధవి కాళ్ల