దోశ పురాణం
దోశ దోషయన్న గుండ్రముగా ఉండును
నెయ్యి ఘుమాయింపు తో గుబాలింపు తో
కర కర యనుచూ కారము దోశ
మిస మిస లాడుతున్న మసాలా దోశ
పర పరా యనుచూ పన్నీరు దోశ
చిరచిర లాడుతున్న చీజ్ దోశ
దోషయాన్న ఇది యనుచు నోరుంరంగా…. రంగా… యనుచూ
అఘ్రానితమీ దోశ, చిట్టి ,చిట్టి దోశ లోయమ్మ పండుమిరప
పచ్చటి తాంబూలం వలె నోరంతా ఘాటెక్కిన ఇంకొక్కటి అంటూ
ఆత్మారాముండు అరిచినట్టే……ట్టే.. ట్టె………. ట్ట్టే … ఇది దోశ యనేని చిట్టి దోశ పద్యము ఇది విన్న వారు, చదివిన వారు దోషాలు లేకుండా దోశలు తింటూ ఉందురు గాక.. ఇతి దోశ పురాణం సమప్తహా:
– భవ్యచారు
దోశ పురాణం బాగుంది.